S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/12/2020 - 06:12

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలుగా ఏర్పడిన ములుగు, నారయణ్‌పేట్‌కు వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కోడ్ నెంబర్‌లను రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అథారిటీ కేటాయించింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు జిల్లాకు టీఎస్-37, నారాయణ్‌పేట్ జిల్లాకు టీఎస్-38 కోడ్‌ను కేటాయించడం జరిగిందని ఆర్‌టీఏ ఉన్నతాధికారులు తెలిపారు.

02/12/2020 - 06:09

హైదరాబాద్, ఫిబ్రవరి 11: బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధంపై జరిగిన సదస్సుకు హైదరాబాద్ షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ సునీత, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ డీ.విశే్వశ్వర్‌లకు ఆహ్వానం లభించింది.

02/12/2020 - 06:08

హైదరాబాద్, ఫిబ్రవరి 11: విద్య, ఆరోగ్యం, అధికార వికేంద్రీకరణలకు ఓట్లు వస్తాయని ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ రుజువు చేసిందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. దేశ రాజకీయాలను మార్చే ఒక మార్గంగా దీనిని చూడాలన్నారు. ఆప్ ఓడిపోయి ఉంటే నిజాయితీగా డబ్బు, మద్యం, పంచకుండా చేసే రాజకీయాలకు ఓట్లు పడవన్నారు. విద్య, ఆరోగ్యం, అంటే కులం, మతం వంటి వాటికే ఓట్లు పడతాయన్నారు.

02/12/2020 - 06:07

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో చెత్త తొలగించేందుకు, డంపుయార్డులకు తీసుకునిపోయేందుకు ట్రాలీ, ట్రాక్టర్, ట్యాంకర్, డోజర్ కొనాలని ఆదేశాలు జారీ చేశారని, అవసరం లేని చోట కొనుగోలు ఆపుచేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

02/12/2020 - 01:10

హైదరాబాద్: ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులే రాష్ట్రానికి రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలన్నారు. ‘మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాలకు వెళ్లి అధ్యయనం చేయాలి, ఉత్తమ పద్ధతులు, విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలి.

02/12/2020 - 01:04

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ‘పాతిక రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారాలి. ఆలోగా పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీరాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి. అందులో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి పర్చుకోవాలో విడమరిచి చెప్పాలి. సర్పంచ్‌లు, కార్యదర్శులకు విధులు, బాధ్యతలను తెలియజేయాలి. ఆ తర్వాత పది రోజుల గడువు ఇచ్చి రాష్టవ్య్రాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి.

02/12/2020 - 00:59

హైదరాబాద్, ఫిబ్రవరి 11: మైసూరులోని భారతీయ భాషా సంఘం దక్షిణ ప్రాంతీయ కేంద్రం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా తెలుగేతర ఉపాధ్యాయులకు తెలుగు నేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు నేర్చుకున్న ఉపాధ్యాయులు మంగళవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.

02/11/2020 - 05:47

కరీంనగర్, ఫిబ్రవరి 10: బతుకు బాట..ఉపాధి వేటలో..ఇరాక్ దేశానికి పయనమైన భారతీయులు అక్కడ అనుభవిస్తున్న బాధలను ఒక్కొక్కటిగా ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి దృష్టికి సోమవారం తీసుకువచ్చారు.

02/11/2020 - 05:44

హైదరాబాద్, ఫిబ్రవరి 10: నేరుగా నియామకం అయిన గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ) సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, అవసరాన్ని అనుసరించి ఇతర శాఖల్లో తమ సేవలను ఉపయోగించుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలంతా లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి సోమవారం లేఖలు అందచేశారు. జిల్లాల వారీగా వీఆర్‌ఏల సంఘాల తరఫున కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు.

02/11/2020 - 05:42

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 10: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అష్టోత్తర శతఘటాభిషేకం, ఋత్విక్ సన్మానంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో మూలవరులకు ఉత్సవ వరులకు పాంఛరాత్రగమశాస్త్రానుసారం వేదపారాయణ, పఠనాథులతో అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యం నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు పంచామృతాలతో, ఫలరసాలతో, పరిమళ సుగంధ ద్రవ్యాలతో, మంత్రపూర్వక జలములతో అభిషేకించారు.

Pages