S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/16/2020 - 05:12

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఉయ్ లవ్ ఫర్ కేసీఆర్ లోగోను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలవిహార్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని వినూత్న పంథాలో చేపట్టనున్నట్లు చెప్పరు.

02/16/2020 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు.

02/16/2020 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మహానగరంలో ఎక్కడబడితే అక్కడ అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టరాదంటూ, డీఫేస్‌మెంట్ యాక్టును ఉల్లంఘించి నగరాన్ని కళావిహీనంగా మార్చోద్దంటూ మున్సిపల్ మంత్రి కేసీఆర్ ఎన్ని సార్లు హితవు పలికినా, అధికారపార్టీకి చెందిన అమాత్యుల్లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. మంత్రి కేటీఆరే రెండు సార్లు పలువురు కార్పొరేటర్లకు జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే!

02/16/2020 - 02:11

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గాంధీ ఆసుపత్రిలో అక్రమాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని రాష్ట్ర వైద్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ స్థాయిలో ఉన్న ఒక వైద్యుడు ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదన్నారు.

02/16/2020 - 02:10

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తాను రాజకీయాలపై మూడు నెలల పాటు వౌనంగా ఉంటానని చెప్పానంటే ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడకపోవడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ రేసులో తాను ఉన్నట్లు చెప్పడమంటే ఇంటి సమస్యలపై వౌనంగా ఎలా ఉంటానని అన్నారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం లేదన్నారు.

02/16/2020 - 02:10

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లపై కుట్రపన్నుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన ధర్నా దీక్షను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీన సోమవారం ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆయన కోరారు.

02/16/2020 - 02:09

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాష్ట్రంలో పలు అభివృద్ధి అంశాలను సమీక్షించనున్నారు.

02/16/2020 - 02:08

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు బయో ఏషియా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బయో ఏషియా సదస్సు సందర్భంగా లైఫ్ సైనె్సస్ విభాగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

02/16/2020 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో గిరిజనుల సంస్కృతిని పరిరక్షించిన మహానేత కేసీఆర్ అని, గిరిజనుల సంక్షేమం కోసం ఇతోధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

02/16/2020 - 02:13

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పల్లెల ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిప్రజాప్రతినిధులను కోరారు. ఈ నెల 20వ తేదీ వనపర్తి, 21వ తేదీన జోగుళాంబ గద్వాల, 23వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాల్లో పంచాయతీ సమ్మేళనాలకు ఇన్‌చార్జీగా మంత్రిగా హాజరవుతున్నుటల్చెప్పారు. గాంధీజీ కలలుకన్న గ్రామ వికాసం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తపిస్తునానరన్నారు.

Pages