S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/17/2019 - 04:40

హైదరాబాద్, మే 16: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో వచ్చేందుకు చేస్తున్న ప్రచార నాటకాలను ప్రజలు నమ్మరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. గురువారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.

05/17/2019 - 04:39

హైదరాబాద్, మే 16: మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు నెల రోజులు ఆలస్యంగా జూన్, జూలై నెలల్లో నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదన సరైనది కాదని, ఈ విషయమై తమ అభ్యంతరాలు తెలియచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడ గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ నెల 23వ తేదీన పార్లమెంటు ఎన్నికలు వెలువడనున్నాయి.

05/17/2019 - 04:38

హైదరాబాద్, మే 16: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు 2019 జూన్ రెండోవారం తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. నక్రేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీల గడువు వచ్చే నెలతో పూర్తవుతుంది. జూలైలో కొత్త పాలక వర్గాలు రావలసి ఉంటుంది.

05/17/2019 - 04:38

కరీంనగర్, మే 16: తెలంగాణలో వడదెబ్బకు వివిధ జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు. వృద్ధులు,దినసరి కూలీలే కాదు, ఒక విద్యార్థిని సైతం ఈ వడదెబ్బకు కన్నుమూసింది. సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయికృష్ణ థియేటర్ వెనుక బజారులో దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న వడ్డాణపు కోటయ్య (65) వడదెబ్బకుగురై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

05/17/2019 - 03:55

యాదగిరిగుట్ట, మే 16: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు రెండో రోజు గురువారం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం వైభవోపేతంగా కొనసాగాయి. బాల ఆలయంలో ఉదయం నిత్య హవనములు, మూలమంత్ర జపములు, లక్ష్మీసూక్త శ్రీ విష్ణు సహస్రనామ పారాయణములు నిర్వహించారు.

05/17/2019 - 04:32

ధర్మపురి, మే 16: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా గురువారం ఉదయం ధర్మపురి దేవస్థానంలో ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు రాత్రి మొదటి జామున పునర్వసు నక్షత్రంలో ఆరు గ్రహాలు ఉచ్ఛస్థితి యందుండగా పరశురాముడు జన్మించాడు.

05/17/2019 - 03:50

హైదరాబాద్, మే 16: తైవాన్‌లోని ఆసియా యూనివర్శిటీ గౌరవ ప్రొఫెసర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు నియమితులయ్యారు. జీవశాస్త్రంలో ప్రఖ్యాత శాస్తవ్రేత్తగా పేరుగడించిన పొదిలి అప్పారావు ఆసియా యూనివర్శిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ మేరకు ఆసియా యూనివర్శిటీ అధ్యక్షుడు జెఫర్ జేపీ టిసాయి ఉత్తర్వులను అందజేశారు.

05/17/2019 - 03:50

బొమ్మలరామారం, మే 16: హాజీపూర్ నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ అతని చేతిలో హత్యకు గురైన శ్రావణి, కల్పన, మనీషాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలోని గుడిబాయిచౌరస్తా వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.

05/17/2019 - 03:49

బాసర, మే 16: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో గురువారం రాష్ట్ర దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి విచారణ నిర్వహించారు. ప్రసాదాల తయారీ విభాగంలో అవినీతి చోటు చేసుకుంటోందని, ఆలయ ఉన్నత అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

05/16/2019 - 04:26

పెద్దఅడిశర్లపల్లి, మే 15: జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కృష్ణా తాగుజలాలు సరఫరా చేసే ఏఎమ్మార్పీ పుట్టంగండి అత్యవసర మోటార్ల ఏర్పాటుకు జలమండలి కసరత్తు చేస్తోంది. రూ. 2 కోట్ల అంచనాలతో గత నెల 24న టెండర్లు పిలిచినప్పటికీ అనర్హత సమస్య ఎదురవ్వడంతో మరోసారి ఈనెల 3న టెండర్‌లను పిలిచారు.

Pages