S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/15/2019 - 04:00

హైదరాబాద్, మే 14: సినీరంగ ప్రముఖుల మాదక ద్రవ్యాల కేసు కంచికి చేరినట్టే ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీరాలు పలికిన దర్యాప్తు అధికారుల హెచ్చరికలు ఉత్తుత్తి మాటలేనని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ బయట పెట్టింది.

05/15/2019 - 03:59

హైదరాబాద్, మే 14: తెలంగాణ బాసర లోని రాజీవ్ గాంధీ నాలెడ్జి టెక్నాలజీస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను వీసీ డాక్టర్ అశోక్ కుమార్ విడుదల చేశారు. పదో తరగతి విద్యార్హతతో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నెల 24వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు.

05/15/2019 - 03:59

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే శక్తులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత జీ కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో నగరంలో అశాంతిని నెలకొల్పే విధంగా మజ్లిస్ పార్టీ చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

05/15/2019 - 03:58

హైదరాబాద్, మే 14: 2019 జూన్ 5 న నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘గాలి కాలుష్య నిర్మూలన’ అంశంపై వ్యాసరచన పోటీలను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గాలి కాలుష్య నిర్మూలన అంశంపై ‘బెస్ట్ ఐడియా’ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యావరణవేత్తలు, విద్యార్థులు తదితరులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

05/15/2019 - 03:57

హైదరాబాద్, మే 14: ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలతో అనూహ్య ఫలితాలు చూసి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులు అంతా ఏకీకృతం అవుతున్నారు. రాష్ట్రంలో 23 మంది ఇంత వరకూ మరణించగా వారిలో 11 మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

05/15/2019 - 03:55

హైదరాబాద్, మే 14: నకిలీ పత్తి విత్తనాలు, కలుపుమందును తట్టుకునే బీటీ పత్తి విత్తనాలు ప్యాకెట్ల రూపంలోనూ, విడిగానూ అమ్మినా, వీటిని సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా హెచ్చరించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

05/15/2019 - 03:36

ఆదిలాబాద్,మే 14: ప్రాదేశిక ఎన్నికల చివరి అంకం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగానే ముగిసినప్పటికీ తమ గిరిజన గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రెండు గిరిజన గ్రామాలు స్వచ్ఛందంగా మంగళవారం ఎన్నికలను బహిష్కరించాయ.

05/15/2019 - 03:34

నల్లగొండ, మే 14: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్‌లతో కలిసి ఆమె కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

05/15/2019 - 03:30

చౌటుప్పల్, మెట్‌పల్లి, మే 13: తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కొరగోని చెన్నమ్మ (60) మంగళవారం వడదెబ్బకు గురై మరణించింది. గత మూడు రోజులుగా వడదెబ్బతో అస్వస్థతకు గురైన ఆమెను చికిత్సకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

05/15/2019 - 03:29

గజ్వేల్, మే 14: కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్ అహంకారంతో నిర్వాసిత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆమరణ దీక్ష చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి సంఘీభావం ప్రకటించి విలేఖరులతో మాట్లాడారు.

Pages