S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/16/2019 - 02:45

హైదరాబాద్, మే 15: షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల రెండో మాస్ మీడియా ఫోరంలో పాల్గొనేందుకు భారత్ ప్రతినిధిగా సమాచార మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేసింది. రెండో మాస్ మీడియా ఫోరం ఈ నెల 23 నుండి 26 వరకూ కర్గిస్తాన్ బిష్కెక్‌లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ అభివృద్ధిలో మాస్ మీడియా పాత్రపై చర్చ జరగనుంది.

05/16/2019 - 02:45

హైదరాబాద్, మే 15: మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా 1వ తరగతి నుండి 8వ తరగతి వరకూ మొదటి విడతగా 177.70 కోట్లు విడుదల చేసినట్టు పాఠశాల విద్య కమిషనర్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు.

05/16/2019 - 02:44

హైదరాబాద్, మే 15: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 27 న నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని, అల్లర్ల కారణంగా ఎక్కడ కూడా రీపోల్ జరగలేదన్నారు.

05/16/2019 - 02:43

హైదరాబాద్, మే 15: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికకు అభ్యర్థి ఎంపిక తెలంగాణ రాష్ట్ర సమితికి పరీక్షగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నేతలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇవ్వడంతో వీరిలో అవకాశం ఎవరికి దక్కుతుందన్నది పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

05/16/2019 - 02:42

హైదరాబాద్, మే 15: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు లుక్‌అవుట్‌కు పోలీసులు రంగ సిద్ధం చేస్తున్నారు. వారు విదేశాలకు పారిపోకుండా ఉండడానికి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అలర్ట్‌ను ప్రకటించనున్నారు.

05/16/2019 - 02:40

హైదరాబాద్, మే 15: రాష్ట్రంలో నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, చేవెళ్ల తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, ఆ తర్వాత నమోదైన పోలింగ్ వివరాలు తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. ఈ విషయమై తాము ఎన్నికల ప్రదానాధికారికి లేఖ రాసినా, సానుకూలంగా స్పందించలేదన్నారు.

05/15/2019 - 04:04

హైదరాబాద్, మే 14: అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటనే పునర్ ప్రతిష్టించాలని అఖిల పక్ష నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిల పక్ష నాయకులు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.

05/15/2019 - 04:02

హైదరాబాద్, మే 14: తెలంగాణ పాలిసెట్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ షెడ్యూలును మంగళవారం నాడు ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేయడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ ఖరారు, సర్ట్ఫికేట్ల పరిశీలన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మూడు రోజులు గడువిస్తారు. 19వ తేదీలోగా తమ ప్రాధాన్యతలను నమోదు చేయాలి.

05/15/2019 - 04:01

హైదరాబాద్, మే 14: విదేశీ యాత్రికులకు ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాలీనా 12 నుంచి 13 శాతం మేరకు యాత్రికుల సంఖ్య వృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాత్రికుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు తెలంగాణ పర్యాటక శాఖ అంచనా వేసింది. 2018లోనే 3.18 లక్షల మంది విదేశీ యాత్రికులు హైదరాబాద్‌ను సందర్శించారు.

05/15/2019 - 04:01

హైదరాబాద్, మే 14: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని, ఎక్కడ చూసినా ప్రధాని మోదీ ప్రభంజనమే కనపడుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తాను ఉత్తరాది రాష్ట్రాల్లోల జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ప్రభంజనం కనిపిస్తోందన్నారు.

Pages