S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/15/2019 - 02:10

హైదరాబాద్, మే 14: ఆంగ్లంలో భారతీయ సాహిత్యం వైవిధ్యం అనే పేరుతో ఎం రాజగోపాలాచారి రాసిన గ్రంథాన్ని బుధవారం నాడు ఉస్మానియా అతిథిగృహంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో శాతవాహన యూనివర్శిటీ వీసీ టీ చిరంజీవులు ఆవిష్కరించనున్నారు.

05/15/2019 - 02:09

హైదరాబాద్, మే 14: రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ తెలుగు మాద్యమంలో చదివే విద్యార్థులు, తెలుగును భాషాంశంగా చదివేవారు తగ్గిపోతున్నారు. పదో తరగతి పరీక్షలకు 5,52,280 మంది నమోదు చేసుకోగా, ఆంగ్లమాద్యమంలో హాజరైన వారి సంఖ్య 3,27,212 కాగా తెలుగు మాద్యమంలో హాజరైన వారు 1,67,765 మంది మాత్రమే.

05/14/2019 - 17:16

హైదరాబాద్: నార్త్‌కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సాహిత్‌రెడ్డి మృతిచెందాడు. రోడ్డు దాటుతున్న బొంగుల సాహిత్‌రెడ్డిని కారు ఢీకొనటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మృతుడు విద్యానగర్ పద్మకాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడిగా గుర్తించారు.

05/14/2019 - 13:28

వికారాబాద్: ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడు హత్యకు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో ఇంద్రసేనగౌడ్ (20) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

05/14/2019 - 04:38

ఆర్మూర్, మే 13: వ్యవసాయ బావిలో పడి తీవ్రంగా గాయపడిన దుప్పి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అటవీ శాఖ అధికారుల కథనం మేరకు నిజామాబాద్ జిల్లా గోవింద్‌పేట్ గ్రామ శివారులోని ప్రతాప్‌రెడ్డి వ్యవసాయ బావిలో దుప్పి పడినట్టు గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బావిలో దుప్పి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారి శ్రీశైలంకు సమాచారం అందించారు.

05/14/2019 - 04:36

నల్లగొండ, మే 13: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు.

05/14/2019 - 04:35

మహబూబ్‌నగర్‌టౌన్, మే 13: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఓ వ్యక్తి కిరోసిన్ డబ్బా తీసుకువచ్చి హల్‌చల్ సృష్టించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న పోలీసులు అతడిని వారించడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. యాదయ్య అనే రైతు రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు.

05/14/2019 - 04:33

గజ్వేల్, మే 13: కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితి చక్కదిద్దగా, నిర్వాసితులను దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

05/14/2019 - 04:29

హైదరాబాద్, మే 13: గమ్యం వెనుక పరుగులు తీస్తే విజయం వరిస్తుందో తేదో తెలీదుకానీ సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుని శక్తి- యుక్తుల్ని సరిగ్గా అంచనా వేసుకుని అడుగులు వేస్తే, విజయం తప్పకుండా వరిస్తుంది. మనోధైర్యం, పట్టుదల, అడ్డంకులను అధిగమించే స్థిరత్వం ఉన్నవ ఆరు విజయాన్ని ముద్దాడుతారు. అలాంటి ఉదాహరణే యూ రుత్విక్ రామ్.

05/14/2019 - 04:28

వనపర్తి, మే 13: మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం క్షేత్ర సహాయకుడు రాఘవేందర్ రెడ్డిని, పంచాయతీ కార్యదర్శిని ఉద్యో గం నుండి తొలగిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి తెలిపారు. సోమవారం ఆమె కొత్తకోట మండలం పాలెం గ్రామంలో స్వక్షభారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Pages