S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/18/2019 - 04:06

జహీరాబాద్, మే 17: మహీంద్రా యాన్స్‌లరీ కంపెనీ ముస్కో(ఐడీఏ)లో నైట్రోజన్ పేలి ఒక ఇంజనీర్ మృతి చెందగా, మరో నలుగురు ఇంజనీర్లు, కార్మికుడు గాయపడ్డారు. ఈ ఘటన చిరాగ్‌పల్ల పోలీస్‌స్టేషన్ పరిధి బూచినెల్లి పారిశ్రామిక వాడలో విషాదం నింపింది. పోలీసులు, కార్మికుల కథనం ప్రకారం..ముస్కోలో వెల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికులు ‘టీ’ టైం కావడంతో అందరూ టీ కోసం వెళ్లారు.

05/18/2019 - 04:05

హైదరాబాద్, మే 17: నెదర్లాండ్‌కు చెందిన వ్యవసాయ నిపుణుల బృందం ప్రతినిధి సీబ్ చూర్ శుక్రవారం ఇక్కడ సచివాలయంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాతో సమావేశమై రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ అభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పశుసంవర్థక , పాడి, మత్స్య రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.

05/18/2019 - 04:04

హైదరాబాద్, మే 17: తుది విడత ఎన్నికలు పూర్తి కాకుండానే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోదీ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రాంతీయ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవ రు ఉన్నా అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించడం కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు.

05/18/2019 - 04:03

హైదరాబాద్, మే 17: రాష్ట్రప్రభుత్వం ఇంటర్ ఫలితాల అక్రమాల దొంగలను కాపాడుతోందని ఆరోపిస్తూ విద్యార్థి , యువజన సంఘాల నేతలు శుక్రవారం నాడు మంత్రుల నివాసాల ప్రాంగణాన్ని ముట్టడించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు విద్యార్థి నేతలను, యువజన సంఘాల నేతలను అరెస్టు చేసి పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

05/18/2019 - 04:02

హైదరాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం బాగుందని, ఏటేటా ధాన్యం దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు దోహదపడుతున్నాయని భారత ఆహార సంస్థ ప్రశంసించింది. తెలంగాణ రైస్ మిల్లర్ల వద్ద ఉన్న 3.44 లక్షల టన్నుల ముడి బియ్యాన్ని తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సంసిద్థత వ్యక్తం చేసింది.

05/18/2019 - 04:01

సైదాబాద్, మే 17: తెలంగాణ జైళ్లశాఖ వినూతనంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంస్కరణల ఫలితంగా తెలంగాణలోని 49 జైళ్లలో 17 జైళ్లను తాత్కాలికంగా మూసివేసామని తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ వెల్లడించారు. నేర రహిత సమాజం కోసం జైళ్లశాఖ అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వీకే.సింగ్ తెలిపారు.

05/18/2019 - 03:36

హైదరాబాద్, మే 17: ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్న గొప్ప సమైక్యతావాది అని, టైమ్స్ పత్రికల్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు బురదజల్లేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ మానిఫెస్టో కమిటీ సభ్యురాలు కరుణ గోపాల్ చెప్పారు.

05/18/2019 - 03:35

హైదరాబాద్, మే 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ పీజీ కోర్సులు, ఎంఫిల్, పీహెచ్‌డీతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఈ నెల 27 నుండి 31 వరకూ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అడ్మిట్ కార్డులను ఈ నెల 20 నుండి జారీ చేస్తారు.

05/18/2019 - 03:34

కనగల్, మే 17: నాకు మతిభ్రమించిందన్న నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వక, చివరకు ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన షాక్‌తో మతిభ్రమించిందని దీంతో తనను తిడితేనన్న కేసీఆర్ ఏదో పదవి ఇస్తారన్న భ్రమలతో ఆయన తనపై విమర్శలు చేస్తున్నాడని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

05/18/2019 - 03:31

హైదరాబాద్, మే 17: పదో తరగతి పరీక్షల్లో అనూహ్య ఫలితాలు రావడంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెలగాటంగా మారిందని, విద్యార్థులను, తల్లిదండ్రులను సీట్లు పేరిట ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

Pages