S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/28/2018 - 04:05

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27: ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిన చేనేత వస్త్ర కళకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని కేంద్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు.

09/28/2018 - 04:03

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం మీడియా ప్రతినిధులకు కేంద్రంగా ‘మీడియా సెంటర్’ను గురువారం ప్రారంభించారు. తెలంగాణ సచివాలయంలోని ‘డీ’ బ్లాకులోని పబ్లిసిటీ సెల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. మీడియా ప్రతినిధులు ఉపయోగించుకునేందుకు వీలుగా కంప్యూటర్లను ఏర్పాటు చేశారు.

09/28/2018 - 04:02

హైదరాబాద్, సెప్టెంబర్ 27: అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ప్రపంచంలో రెండవ అతి పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థ ‘ఆంథమ్’ ఇండియాలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా విస్తరణకు ఎంచుకుంది. ఈ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే యూనిట్ వల్ల సుమారు రెండు వేల ఉద్యోగాలు వస్తాయని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఇండియాలో హెల్త్‌కేర్‌కు హైదరాబాద్ హబ్‌గా మారబోతుందన్నారు.

09/28/2018 - 04:01

కరీంనగర్, సెప్టెంబర్ 27: మిత్రపక్షాల మహాకూటమికి లైన్ క్లియర్ అయినప్పటికీ ఓ వైపు ఎక్కడెక్కడ ఎవరికివ్వాలి? ఎన్నివ్వాలి? అనే అంశాలపై చర్చలు సాగుతుండగా, మరోవైపు పార్టీల నుంచి సీట్లను ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న దరిమిలా ఇంకా ఒక కొలిక్కిరావడం లేదు. ఆలస్యమవుతున్న కొద్దీ సీట్లపై కనే్నసిన ఆశావహులు నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతూ, ఇంకెన్ని రోజులో అంటూ నిరీక్షిస్తున్నారు.

09/28/2018 - 04:00

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో యాసంగి పంటలకు సంబంధించి పెట్టుబడులకోసం రైతుబంధు పథకాన్ని అమలు చేసే బాధ్యతను తొమ్మిది బ్యాంకులకు అప్పచెప్పారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి అధ్యక్షతన గురువారం ఇక్కడ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది.

09/28/2018 - 03:55

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధం లేదని భాజపా నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయాలని ఐటీ అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పేంత ఖర్మ బీజేపీకి పట్టలేదని అన్నారు.

09/28/2018 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 27: శాసనమండలిలో ఆధునీకరించిన సమావేశ మందిరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం నాడు సందర్శించి వీక్షించారు. అనంతరం ఆయన శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లి నేతలతో కొద్ది సేపు గడిపిన అనంతరం శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశమందిరాన్ని ఆధునీకరించిన అంశాన్ని మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు వివరించారు.

09/28/2018 - 03:51

హైదరాబాద్, సెప్టెంబర్ 27: జంట నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. రోడ్డు భద్రతపై చైతన్యం అన్న నినాదంతో గత జూలై నెలలో ప్రారంభించిన అవగాహన కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

09/28/2018 - 03:48

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాజ్యాంగ నిపుణుడు సోమనాథ్ ఛటర్జీ, బహుముఖ ప్రజ్ఞాశీలి కరుణానిధి అంటూ శాసనమండలి గురువారం ఇరువురు నేతలకూ సంతాపాన్ని వ్యక్తం చేసింది. మరో పక్క ఇటీవల జరిగిన కొండగట్టు మృతులకు, కేరళ వరద ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శాసనమండలి నివాళులు అర్పించింది. అనంతరం శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

09/28/2018 - 03:47

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెరాస ఓటమే ధ్యేయంగా ఎన్నికలకు వెళుతున్న సమయంలో మహాకూటమిలో జరుగుతున్న చర్చల సారాంశంపై లీకేజీలు ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకూటమి సీట్ల కేటాయింపులపై లీకేజీ వార్తలతో అసలు లక్ష్యానికే నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Pages