S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/27/2018 - 06:01

హైదరాబాద్, సెప్టెంబర్ 26: రాజధానికి చెందిన ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు మినహా తెలంగాణ రాష్ట్ర మంత్రులు సచివాలయానికి రావడం దాదాపు నిలిపివేశారు. కేసీఆర్ మంత్రివర్గలోని 17 మంది మంత్రుల్లో ముగ్గురు ఎమ్మెల్సీలే కావడం గమనార్హం. ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమ్మద్ మహమూద్ అలీతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

09/27/2018 - 06:00

హైదరాబాద్, సెప్టెంబర్ 26: పంచాయతీ కార్యదర్శులుకు విధులు, బాధ్యతలకు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీ చట్టం-2018 కి సంబంధించి నియమావళిని నిర్దేంచారు. ఈ మేరకు పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో జీఓ (ఎంఎస్ నెంబర్ 108) జారీ అయింది. మొత్తం 30 విధులు, బాధ్యతలు ఇచ్చారు. ఇవి ఇలా ఉన్నాయి.

09/27/2018 - 05:59

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో బీ కేటగిరి సీట్లలో నకిలీ అభ్యర్ధుల సంఖ్య బాగా పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడో ఉండి, ఇక్కడ వివిధ కోర్సుల్లో చేరుతున్న అభ్యర్ధుల పేర్లను ర్యాటిఫికేషన్ పేరుతో ఉన్నత విద్యా మండలిలో అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

09/27/2018 - 03:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను నిర్వహించవద్దని తెలంగాణ జన సమితి(టీజేఎస్) కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. టీజేఎస్ నాయకుడు కపిలవాయి దీలీప్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ఈసీ అధికారులను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

09/27/2018 - 03:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: శాసనసభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను అక్టోబర్ 15 నాటికి ఖరారు చేయనున్నారు. అభ్యర్థుల పేర్లను మూడు విడతలుగా ప్రకటించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం భావసారూప్యత గల పార్టీలతో పొత్తులను రెండు,మూడు రోజుల్లో ఖరారు చేసుకోనుంది.

09/27/2018 - 01:16

నిజామాబాద్, సెప్టెంబర్ 26: సమీప భవిష్యత్తులో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని, ఇందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగనున్న కేసీఆర్ సభ నాందిగా నిలువనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

09/27/2018 - 01:13

తూప్రాన్, సెప్టెంబర్ 26: ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు నినాదంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు న్యాయం చేయలేదని, జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు.

09/27/2018 - 01:11

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : రాజకీయ పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని.. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్ని, చెప్పనివి సైతం అమలు చేసినట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ అంశాలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

09/27/2018 - 01:09

జగిత్యాల, సెప్టెంబర్ 26: ఈనెల 11న కొండగట్టు ఘాట్ రోడ్ ప్రమాదంలో 62మంది మృతిచెందగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్ర శుద్థితోపాటు ఈ దుర్ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని జగిత్యాల ప్రాంతం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే నారాయణ బలి హోం నిర్వహించినట్లు పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి వెల్లడించారు.

09/27/2018 - 01:07

కరీంనగర్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రం వచ్చాకే రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలు, కొత్త రైళ్లు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైల్వే లైన్ల అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేస్తున్నదని తెలిపారు.

Pages