S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/27/2018 - 01:04

నల్లగొండ, సెప్టెంబర్ 26: మహాకూటమి ఓ మాయల కూటమి..అదో దుష్ట చతుష్టయం వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రం నల్లగొండలో ఈ నెల 4న ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సభాస్థలిని బుధవారం జగదీశ్‌రెడ్డి పరిశీలించారు.

09/26/2018 - 17:41

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారంనాడు గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు. రేపటి నుంచి మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

09/26/2018 - 12:42

హైదరాబాద్: నగరంలో అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశారు.

09/26/2018 - 12:35

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లి, కవాడిగూడ, హిమయత్‌నగర్, రాంనగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం కురిసింది.

09/26/2018 - 06:12

కరీంనగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబయికు వెళ్లే రైలు బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

09/26/2018 - 06:10

నిజామాబాద్, సెప్టెంబర్ 25: ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతో జతకడుతున్న మహాకూటమి వెనుక మహాకుట్ర దాగి ఉందని మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి అనుమానాలు వెలిబుచ్చారు. తెలంగాణలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే పరస్పరం విభేదించుకున్న ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన ఆరోపించారు.

09/26/2018 - 06:09

మంచిర్యాల, సెప్టెంబర్ 25: ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మంగళవారం పట్టణంలోని ఐబీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

09/26/2018 - 06:08

బాసర, సెప్టెంబర్ 25: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి యాజమాన్యం సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గత రెండు రోజులుగా జరుగుతున్న విద్యార్థులు శాంతియుత నిరసన మంగళవారం రాత్రి వరకూ కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన నిరసన పలు దఫాలుగా భైంసా ఆర్డీవో రాజు, భైంసా డీఎస్పీ రాజేష్ భల్లా విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

09/26/2018 - 06:07

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను ఎన్నికల బరిలోకి దించుతామని ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభ్రదం వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పటిది కాదని బీఎల్‌ఎఫ్ ఏర్పాటు చేసిన మరుసటి రోజునే నాయకత్వం వహించాల్సిందిగా కృష్ణయ్యను కోరినట్టు ఆయన తెలిపారు.

09/26/2018 - 06:05

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న చైర్మన్‌గా 97 మందితో ఒక కమిటీని వేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Pages