S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/26/2018 - 06:04

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. కేటీఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టొ) కమిటీకి వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

09/26/2018 - 06:03

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాటలను అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిజం చేశారని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదని కిరణ్‌కుమార్ రెడ్డి అనే వారని, ఇప్పుడు అవే మాటలను కేసీఆర్ నిజం చేవారని పొన్నం మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.

09/26/2018 - 01:13

నిజామాబాద్, సెప్టెంబర్ 25: ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతో జతకడుతున్న మహాకూటమి వెనుక మహాకుట్ర దాగి ఉందని మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి అనుమానాలు వెలిబుచ్చారు. తెలంగాణలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే పరస్పరం విభేదించుకున్న ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన ఆరోపించారు.

09/26/2018 - 01:11

జగిత్యాల, సెప్టెంబర్ 25: తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల పరిపాలన ఆ నలుగురి గుప్పిట్లోనే బందీ అయిందని సీఎం కుటుంబం రాచరిక కుటుంబంలానే వ్యవహరిస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎల్.

09/26/2018 - 01:09

సిరిసిల్ల, సెప్టెంబర్ 25: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘జాతీయ స్థాయి క్రీడల స్టేడియం, పట్టణంలో వంద ఎకరాల్లో ‘అర్బన్ పార్కు’ నిర్మించనున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. మంగళవారం సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ తొలుత అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించి, మానేరులో బతుకమ్మ ఘాట్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.

09/26/2018 - 01:05

బాసర, సెప్టెంబర్ 25: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి యాజమాన్యం సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గత రెండు రోజులుగా జరుగుతున్న విద్యార్థులు శాంతియుత నిరసన మంగళవారం రాత్రి వరకూ కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన నిరసన పలు దఫాలుగా భైంసా ఆర్డీవో రాజు, భైంసా డీఎస్పీ రాజేష్ భల్లా విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

09/26/2018 - 01:02

మంచిర్యాల, సెప్టెంబర్ 25: ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మంగళవారం పట్టణంలోని ఐబీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

09/26/2018 - 01:01

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 25: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కేరళకు చెందిన సీపీఎం రాజ్యసభ సభ్యుడు సోము ప్రసాద్ కోరారు.

09/26/2018 - 01:00

జగిత్యాల, సెప్టెంబర్ 25: తెలంగాణకే తలమానికమైన కొండగట్టు అంజన్న చెంతకు భక్తులు అధికంగా వచ్చే ఘాట్ రోడ్డుపై ప్రతి 2కిలోమీటర్లకు ఒక ఇండికేషన్, ప్రతి అరకిలోమీటర్‌కో మైలురాయి, డ్రైవర్లకు కౌనె్సలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్, డీజీపీ కృష్ణప్రసాద్ అన్నారు.

09/26/2018 - 00:59

మిర్యాలగూడ, సెప్టెంబర్ 25: మిర్యాలగూడలో ఈనెల 14న హత్యకు గురైన ప్రణయ్ కుటుంబం క్రైస్తవ మతంలోకి మారినందున ఆ కుటుంబానికి ఎస్సీ ప్రయోజనాలు కల్పించవద్దని ఎస్సీ రిజర్వేషన్ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం డిమాండ్ చేశారు. మంగళవారం ఈమేరకు ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రాన్ని అందజేశారు.

Pages