S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/18/2018 - 12:50

హైదరాబాద్: విద్యుత్ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు తీర్పు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హార్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు విద్యుత్ ఉద్యోగులకు పండుగ వంటిదని పేర్కొన్నారు. వెంటనే ఉద్యోగుల క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

09/18/2018 - 12:49

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించాలని గతంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టివేసింది.

09/18/2018 - 12:48

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనకుమార్, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఎసీపీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

09/18/2018 - 12:48

నల్గొండ: యాదాద్రి నల్గొండ జిల్లాలోని మోత్కూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీకృష్ణ వస్త్ర దుకాణంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో దాదాపు కోటి రూపాయలకు పైగా వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యుట్ కారణమని భావిస్తున్నారు. దసరా కోసం తెచ్చిన సరుకును సర్దిన కాసేపటికే అగ్నికి ఆహుతవ్వటం గమనార్హం.

09/18/2018 - 03:21

హైదరాబాద్, సెప్టెంబర్ 17: అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. విలీనదినోత్సవాన్ని మహారాష్ట్ర,కర్నాటక రాష్ట్రాలు కూడా జరుపుకుంటున్నాయని చెప్పారు. ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలుగదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది.

09/18/2018 - 03:14

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు , ప్రధాని నరేంద్రమోదీ కలిసి కుట్రపన్ని చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తయితే ఎస్సారెస్పీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆనాడు చంద్రబాబునాయుడు పోరాటం చేశారని గుర్తుచేశారు.

09/18/2018 - 03:12

హైదరాబాద్/సైదాబాద్, సెప్టెంబర్ 17: అక్రమ పాస్ పోర్టు ఆరోపణల కేసులో చంచల్‌గుడాలో నిందితునిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని ఆ పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.

09/18/2018 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తిరంగ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు అందుకున్న గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నాడు అబిడ్స్ పోలీసుల ముందు హాజరై తన వివరణ లిఖితపూర్వకంగా అందజేశారు. విపక్ష పార్టీలకు చెందిన నాయకుల పరువు తీయడానికి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.

09/18/2018 - 03:00

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్ర గనుల శాఖలో పనివిధానాన్ని ఎలక్ట్రానిక్ తరహాలో నిర్వహించేందుకు వీలుగా ‘ఈ-ఆఫ్‌స్’ ను సోమవారం ప్రారంభించారు. గనుల శాఖ ప్రధాన కార్యాలయంలో ‘మిషన్ మోడ్ ప్రాజెక్టు’ (ఎంఎంపీ) గా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు గనుల శాఖ డైరెక్టర్ బీఆర్‌వీ సుశీల్‌కుమార్ వెల్లడించారు. ఎంఎంపీని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ లాంఛనంగా ప్రారంభించారు.

09/18/2018 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్రే లేదని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కేంద్రంపై వత్తిడి పెంచడానికి రాజీనామా చేద్దామంటే ఆ పార్టీ నాయకుడు జి కిషన్‌రెడ్డి పారిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి నాయిని జాతీయ జెండా ఆవిష్కరించారు.

Pages