S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/18/2018 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 17: వీఆర్వో పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థుల మంగళసూత్రాలను తొలగించాలని కొన్ని కేంద్రాల్లో పర్యవేక్షక సిబ్బంది నిర్బంధం చేయడంతో వారు మంగళసూత్రాలను తీసేసి తమతో వచ్చిన కుటుంబ సభ్యులకు అందజేసిన ఘటనపై పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఎ వాణీ ప్రసాద్ సోమవారం స్పందించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ అలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు ఏవీ ఇవ్వలేదని పేర్కొన్నారు.

09/18/2018 - 02:46

కరీంనగర్, సెప్టెంబర్ 17: ముందస్తుకు అడుగులేసిన సీఎం కేసీఆర్ శాసనసభ రద్దు, వెనువెంటనే టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన చేయగా, విపక్షాలే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, వారు ఇంకా బలమైన అభ్యర్థుల కసరత్తుల్లోనే నిమగ్నమయ్యారు. దీనికితోడు పొత్తులు కూడా కొలిక్కిరాకపోవడంతో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

09/18/2018 - 03:43

మెదక్ రూరల్: నాలుగేళ్లకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అక్రమంగా అధికారంలోకి వచ్చేందుకు టీఆర్‌ఎస్ 36 లక్షల ఓటర్ల పేర్లను గల్లంతు చేసిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకువెళ్లకపోవడం వల్లనే జనం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందన్నారు.

09/18/2018 - 02:41

నల్లగొండ, సెప్టెంబర్ 17: జిల్లా కేంద్రం నల్లగొండలోనే పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఎస్పీ కార్యాలయం, నిఘా విభాగాల కార్యాలయాలు ఉన్నా నేరాల అదుపులో పోలీస్ శాఖ విఫలమవుతుండటం ప్రజల్లో పోలీస్ శాఖ పనితీరు విమర్శల పాలవుతోంది.

09/18/2018 - 02:40

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లినే కాక బీసీ మహిళనైన తనకు హుజూర్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్టు రాకుండా జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి వద్ద అడ్డుపడుతున్నారని నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కే. శంకరమ్మ అన్నారు.

09/18/2018 - 02:38

చిట్యాల, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో తెరాస హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో సోమవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు.

09/18/2018 - 02:36

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 17: ధన, అహంకారంతో పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను హత్య చేశారని, సమగ్ర విచారణకు ప్రభుత్వానికి, పోలీసులకు కాంగ్రెస్ సహకరిస్తుందని సీఎల్‌పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రేమ పెళ్లి చేసుకుని హత్యకు గురైన ప్రణయ్‌కుమార్ ఇంటిని సోమవారం ఆయన సందర్శించారు.

09/17/2018 - 15:37

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. బాబ్లీ వివాదంలో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

09/17/2018 - 15:28

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబరు 17ను పురస్కరించుకుని నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

09/16/2018 - 06:01

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఓటు బ్యాంకు అవకాశవాద రాజకీయాలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Pages