S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2018 - 05:59

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో అమిత్‌షా ఎన్నికల శంఖారావంతో రాజకీయం రగులుకుంది. ముందస్తు ఎన్నికలకు ఉత్సాహంగా ఉరకలెత్తుతున్న టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ శ్రేణుల్లో అమిత్ షా పర్యటనతో ఉత్సాహం ఉప్పొంగింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.

09/16/2018 - 05:58

హైదరాబాద్, సెప్టెంబర్ 15: కేవలం చదువులకే పరిమితం కాకుండా, ప్రాయోగిక శిక్షణకు విద్యాసంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చదువుతో పాటు వృత్తి నైపుణ్యం, వికాసం చాలా అవసరమని ఐటీ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో వృత్తి ,సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో పారిశ్రామిక ఔత్సాహికతను పెంపొందించేందుకు చేపట్టిన స్టార్టప్ ఇండియా యాత్రను ఐటీ మంత్రి కే తారకరామారావు శనివారం నాడు ప్రారంభించారు.

09/16/2018 - 05:57

హైదరాబాద్, సెప్టెంబర్ 15: బీజేపీ విజయానికి అహోరాత్రులు అంకితభావంతో కార్యకర్తలు పనిచేయాలని, దానికి అనుగుణంగా నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మార్గదర్శనం చేశారు. ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు.

09/16/2018 - 05:56

హైదరాబాద్,సెప్టెంబర్ 15: తెలంగాణలో ఆనాటి నిజాం తరహాలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, నాటి సంఘటనలకు నేడు గుర్తు చేసుకోవాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ విముక్తి కోసం పోరాడితే నేడు కేసీఆర్ పాలనను అంతంచేయడానకి ప్రజలు సమాయత్తం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

09/16/2018 - 05:54

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ తరహాలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీకి అనుబంధ విభాగమైన కిసాన్, ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో కోదండ రెడ్డి అధ్యక్షతన కిసాన్ కాంగ్రెస్ సమావేవం జరిగింది.

09/15/2018 - 01:47

గజ్వేల్, సెప్టెంబర్ 14: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మనగూడ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో 23 మందికి తీవ్ర గాయాలు కాగా, ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

09/14/2018 - 17:11

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రజిత్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని అన్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.

09/14/2018 - 12:31

జగిత్యాల : దాదాపు 62 ప్రాణాలను బలిగొన్న బస్సును అధికారులు కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయ నుంచి శుక్రవారం బయటకు తీశారు. బస్సు ఫిట్‌నెస్‌పై ఆర్టీవో అధికారులు విచారణ చేపట్టారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని, బస్సుకు అక్టోబర్‌ 4 వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉందని ఆర్టీవో కిషన్‌రావు తెలిపారు.

09/14/2018 - 12:12

హైదరాబాద్: టాలీవుడ సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఉదయం రాహుల్ నివాసానికి వెళ్లిన వీళ్లీద్దరూ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు.

09/13/2018 - 06:00

* ఆర్టీసీ, ప్రభుత్వానిదే బాధ్యత * రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
* లేకుంటే మహాకూటమి సర్కార్ ఇస్తుంది * రవాణా మంత్రి, చైర్మన్, ఎండీలపై కేసులు పెట్టాలి
* కేసీఆర్ తీరుపై అఖిలపక్ష నేతల మండిపాటు

Pages