S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/26/2019 - 23:17

ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కమిషనర్‌గా ఇటీవల నియామకం అయిన సర్పరాజ్ అహ్మద్ గురువారం ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి, శాఖాపరమైన అంశాలపై కొద్దిసేపు సర్పరాజ్ అహ్మద్ చర్చించారు

12/26/2019 - 23:15

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ కార్యదర్శిగా ఎవరు నియామకం అవుతారన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు మనసులో ఎవరున్నారన్నదే కీలకమైంది. సీనియర్ అయినా జూనియర్ అయినా ఎంపిక చేసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉండటంతో సీఎస్ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఇంకా చర్చల్లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

12/26/2019 - 23:14

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంతం నిర్వహించిన సార్వజనిక ఉత్సవ మహాసభలు గురువారం నాడు ముగిశాయి. ముగింపు సమావేశంలో సంఘ్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడారు. సంఘ్ కార్యవిస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వం ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. దేశం పరమవైభవాన్ని సాధించడానికి ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో సమయాన్ని కేటాయించి పనిచేయాలని హితవుపలికారు.

12/26/2019 - 23:13

హైదరాబాద్, డిసెంబర్ 26:జరగబోవు మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతోంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ విస్తత్రంగా చర్చలు జరపాలని నిర్ణయించింది. జనవరి మొదటి వారంలో పోటీ చేసే అభ్యర్థల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని సీనియర్ నేతలు చెబుతున్నారు. మున్సిపాల్టీలలో రిజర్వేషన్ల అమలు తీరుపై టీడీపీ నేతలు చర్చించనున్నారు.

12/26/2019 - 23:12

హైదరాబాద్, డిసెంబర్ 26: మతం ఆధారంగా పౌరసత్వం ఎంత మాత్రం తగదని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మతోన్మాదంపై అఖిల పక్ష సభ ఆలోచన సబబైనదేనని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ, సీఏఏను అమలు చేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

,
12/26/2019 - 05:28

మానవపాడు, డిసెంబర్ 25: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు గురువారం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 8.30గంటలకు ఉభయ ఆలయాలు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం ఆలయ శుద్ది, మహాసంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మహామంగళహారతితో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు.

12/26/2019 - 05:25

దేవరకద్ర, డిసెంబర్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్రా ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

12/26/2019 - 05:24

మహబూబాబాద్,డిసెంబర్ 25: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని కొందరు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఇటీవల కేసముద్రంలో జరిగిన కార్య క్రమంలో రెండు కులాల వారికి బలుపుందని ఎమ్మెల్యే విమర్శించినట్టుగా వచ్చిన వార్తలపై వివాదం చెలరేగింది. దీనిపై మహబూబాబాద్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ..

12/26/2019 - 05:39

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 25: అవినీతి ఆరోపణలపై ఒక ఎస్‌ఐని అధికారులు సస్పెండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న డీ.సైదాబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ అనంతరంఅతడిని సస్పెండ్ చేస్తూ హైద్రాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు శివశంకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

12/26/2019 - 05:22

నల్లగొండ, డిసెంబర్ 25: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్‌ఎస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతున్నట్టుగా కనిపిస్తుందని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Pages