S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2019 - 04:52

సూర్యాపేట: రాష్ట్ర విభజన సమయానికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ మూడులక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన తెలంగాణ జనసమితి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. పథకాల అమల్లో ఎన్నొ స్ధానంలో ఉందో కాని అధికమైన అప్పుల్లో మాత్రం ఖచ్చితంగా దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తుందన్నారు.

12/29/2019 - 01:03

సికిందరాబాద్, డిసెంబర్ 28: ప్రాచీన వైద్యవిధానం పై రోజురోజుకి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికిందరాబాద్ పద్మారావునగర్‌లో శనివారం జరిగిన మెనో-త్సి-ఖాంగో టిబెటిన్ ప్రజా ఆరోగ్య సేవాకేంద్రం పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.

12/29/2019 - 01:02

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తగదని జై స్వరాజ్ పార్టీ, జన వాహిని పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. ‘లౌకితత్వమా? ఓటు బ్యాంక్ రాజకీయమా?’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సీఏఏను విమర్శించడం అర్థరహితమని వక్తలు అభిప్రాయపడ్డారు.

12/27/2019 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 26: హైదరాబాద్ నగరంలో 2018 తో పోలిస్తే ఈ ఏడాది మూడు శాతం నేరాలు తగ్గాయని పోలీ స్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్, హోంగార్డు స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయడంతో హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్గాయని, పండుగలు, ఉత్సవా లు శాంతియుత వాతావరణం లో విజయవంతంగా జరిగాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

12/27/2019 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 26: కాంగ్రె స్ తలపెట్టిన ర్యాలీతో సహా ఎటువంటి ప్రదర్శనలకు ఈనెల 28వ తేదీ శుక్రవారం హైదరాబాద్‌లో అనుమతించే ప్రసక్తిలేదని, పోలీసు శాఖ ప్రకటించడం, ర్యాలీ నిర్వహించి తీరుతామని పీసీసీ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి.

12/27/2019 - 01:54

హైదరాబాద్, డిసెంబర్ 26: శీతాకాల విడిది కోసం ఈనెల 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడుకు ఈనెల 23న వెళ్లారు. గురువారం తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట ఆయన భార్య కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుండి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.

12/27/2019 - 01:47

హైదరాబాద్, డిసెంబర్ 26: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) , జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)లు వేర్వేరని, ఎన్‌పీఆర్ అనేది ఎన్‌ఆర్‌సీకి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొనడం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచారమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పా రు.

12/26/2019 - 23:23

హైదరాబాద్, డిసెంబర్ 26: దేశంలో మతపరమైన రాజ్యం ఏర్పాటే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా మఖ్దూం భవన్‌లో గురువారం నాడు జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మతోన్మాద, సెక్యూలర్ శక్తుల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోందని అన్నారు.

12/26/2019 - 23:19

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరుగుతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి సీనియర్ నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరు కావాలని కేటీఆర్ కోరారు.

12/26/2019 - 23:18

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రం లో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగకుండా ఎంఐ ఎం, టీఆర్‌ఎస్ పార్టీలు కుట్రపన్ని భగ్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ముస్లిం మతపరమైన నేతలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారని ఆయన మజ్లిస్ పార్టీపై ధ్వజమెత్తారు. ప్రగతిభవన్ ఒక డిటెన్షన్ సెంటర్ అన్నారు.

Pages