S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/24/2019 - 23:32

హైదరాబాద్, డిసెంబర్ 24: వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ అభివృద్ధికి రూపొందించిన ఏ1 ఫర్ తెంలగాణ డాక్యుమెంట్‌ను ఐటీ శాఖమంత్రి కేటీ రామారావు ఆవిష్కరిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నిపుణఉల సమక్షంలో ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సహానీ తదితరులు పాల్గొంటారు.

12/24/2019 - 23:32

హైదరాబాద్, డిసెంబర్ 24: దివంగత మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు.

12/24/2019 - 05:49

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్దిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే మహిళా స్వయం సహాయ సంఘాలకు (ఎస్‌హెచ్‌జి) ఇచ్చే రుణాలపై వడ్డీని తగ్గించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్‌రావు కోరారు. సోమవారం ఇక్కడ జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడుతూ, అన్ని బ్యాంకుల్లో ఒకే రకంగా వడ్డీ ఉండాలని సూచించారు.

12/24/2019 - 05:47

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణలో రోజురోజుకు మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, అన్ని రకాల సమస్యలకు మద్యం కారణమని మహిళలు ధ్వజమెత్తారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మహిళల భద్రత- మనుగడ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని రాష్ట్ర టీడీపీ మహిళా విభాగాం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

12/24/2019 - 05:45

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన అమెరికా తెలుగు అసోసియేషన్, ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన విద్యా సదస్సుకు హాజరయ్యారు.

12/24/2019 - 05:29

హైదరాబాద్, డిసెంబర్ 23: కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షాను హోంశాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ మంత్రి అమిత్‌షాను కట్టడి చేయలేకపోతున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్లమెంటులో అమిత్‌షా మాట్లాడిన తీరు బాగాలేదన్నారు.

12/24/2019 - 05:28

హైదరాబాద్, డిసెంబర్ 23: అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు తరచు సందర్శించి సరిగ్గా పనిచేసేలా పర్యవేక్షించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ లేఖలు రాయాలని నిర్ణయించారు. సోమవారం శాఖ డైరెక్టరేట్‌లో కార్యదర్శి జగదీశ్వర్ ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/24/2019 - 05:28

హైదరాబాద్, డిసెంబర్ 23: అత్యవసర సమయాల్లో డయల్ 100, 112 లకు ఫోన్ చేయడంతో పాటు మహిళలు, పిల్లల రక్షణకు పోలీసు శాఖ చేపట్టిన చర్యలు, హాక్ ఐ యాప్‌ను డౌన్లోడ్ చేయడం, షీ టీమ్ ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు అధికారులచే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు.

12/24/2019 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 23:వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలను చిత్తుగా ఓడిస్తామని, ఈ పార్టీల నిజస్వరూపాన్ని జనంలోకి తీసుకెళ్లనున్నట్లు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు రహస్యమిత్రులని, ఈ పార్టీల బండారాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు.

12/24/2019 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 23: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికకు సమాయత్తమవుతున్నాయి. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయడతంతో రాజకీయ పార్టీల్లో కోలాహలం ప్రారంభమైంది. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వచ్చే నెల 22వ తేదీన పోలింగ్, 25వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.

Pages