S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/25/2019 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రతి విద్యార్థికి క్రీడా స్పూర్తి ఎంతో అవసరం అని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, టీఎస్‌ఆర్టీసీ సీనియర్ మేనేజర్ జీ.కిరణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని పేజ్ కాలేజీలో మంగళవారం జరిగిన క్రీడా వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును ఎలా ఎంచుకోవాలో పేరున్న క్రీడాకారుల జీవిత గాథల ద్వారా వివరించారు.

12/25/2019 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 24: ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి హైస్కూల్ హెడ్మాస్టర్లనే పర్యవేక్షకులుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం చేస్తున్న యోచనపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.

12/25/2019 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

12/25/2019 - 04:44

మహబూబ్‌నగర్, డిసెంబర్ 24: నేషనల్ పాప్‌లేషన్ రిజిస్ట్రర్ (ఎన్‌పీఆర్)ను సైతం ముస్లీం సమాజం ఓప్పుకోరని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుధ్దీన్ ఓవైసీ తెల్చిచెప్పారు. మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో ఎంఐఎం ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. దేశ ప్రజలను అమిత్‌షా, మోదీలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

12/25/2019 - 01:36

హైదరాబాద్, డిసెంబర్ 24: హిందూ సమాజం శక్తివంతం కావాలని ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలె శ్యాంకుమార్ పేర్కొన్నారు. నగర శివార్లలోని మంగళపల్లి వద్ద గల భారత్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆరెస్సెస్ తెలంగాణ విజయ సంకల్ప శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరం ఉద్ఘాటన కార్యక్రమంలో శ్యాంకుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో

12/25/2019 - 01:33

హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల హల్‌చల్ ప్రారంభమైంది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీ ల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడంతో పట్టణాల్లో రాజకీయ వేడి రగిలింది. ఆరు నెలల నుండి చడీచప్పుడు లేకుండా ఉన్న రాజకీయ నేతలకు ఇపుడు చేతినిండా పని తగిలింది.

12/24/2019 - 23:43

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 24: తెలంగాణ భాష, చరిత్ర అభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు.

12/24/2019 - 23:41

ఆదిలాబాద్,డిసెంబర్ 24: ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగునీరందించే పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చెనాకకోర్ట బ్యారేజీ పనులను వచ్చే జూన్‌లోగా పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు సాగునీరందించాలని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు.

12/24/2019 - 23:36

నర్సంపేట, డిసెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంఆర్సీ, క్యాబ్ చట్టాల పేరిట భారతదేశ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి, మతోన్మాద చర్యలకు పూనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణితో వంత పాడుతున్నారని విమర్శించారు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా..

12/24/2019 - 23:34

కుంటాల, డిసెంబర్ 24: నిర్మల్ జిల్లా కుంటాల మండల శివారు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు కుంటాల ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి దౌనెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కుంటాల నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చిరుత కనిపించడంతో వారు వెను తిరిగారని సమాచారం.

Pages