S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/29/2018 - 03:18

హైదరాబాద్, మే 28: తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి సాహిత్యాన్ని భావి తరాలకు అందించాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణ వాసి కావడం ఈ ప్రాంతవాసులకు గర్వ కారణమన్నారు. బొగ్గులకుంటలో సారస్వత పరిషత్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన పంచ సప్తతి మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

05/29/2018 - 03:16

హైదరాబాద్, మే 28: రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా పశువైద్యాధికారులు, పంచాయితీరాజ్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

05/29/2018 - 03:13

కాచిగూడ, మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవన్ని నిలబెట్టిన వ్యిక్తి ఎన్టీఆర్ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు డా.రవ్వా శ్రీహరికి ఎన్‌టీఆర్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ ఎన్‌టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించారు.

05/29/2018 - 03:09

హైదరాబాద్, మే 28: తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలంటూ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్‌కు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. రాజేశం గౌడ్ సోమవారం రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

05/29/2018 - 02:59

చిత్రం..పుత్రశోకంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి ధైర్యం చెబుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితరులు

05/29/2018 - 02:54

హైదరాబాద్, మే 28: గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల శుద్ది కర్మాగారాలను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి చందులాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలో గిరిజన సహకార సంస్థ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయాలని సిద్దం చేసుకున్న ప్రణాళికలను చందులాల్ విడుదల చేశారు.

05/29/2018 - 02:49

హైదరాబాద్, మే 28: వచ్చే నెలలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం 800 మసీదుల్లో గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్‌లో 400 మసీదుల్లో, జిల్లాల్లో 400 మసీదుల్లో కలిపి ఈ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

05/29/2018 - 02:48

హైదరాబాద్, మే 28: తెలంగాణలో జూన్ 1వ తేదీ నుండి పాఠశాలలు, జూనియర్ కాలేజీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కొంత మంది విద్యార్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వేసవి సెలవులను పొడిగించాలని వారు కోరుతున్నారు.

05/29/2018 - 02:47

హైదరాబాద్, మే 28: తెలంగాణ లారీ యజమానుల సంఘం పోరుబాట పట్టేందుకు సన్నద్ధం అవుతోంది. తమ డిమాండ్లను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా దశలవారీగా ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు ఎన్.్భస్కర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న తీర్మానాలను సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

05/29/2018 - 01:33

హైదరాబాద్, మే 28: ఆఫ్రికా ఖండంలో శాంతిని నెలకొల్పాలనే పవిత్ర ఆశయంతో ప్రపంచ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు రవిశంకర్ ఆఫ్రికాలోని లక్ష మందికి పైగా ప్రజలచే ధ్యానం చేయించారు. ‘ఐ మెడిటేట్ ఆఫ్రికా’ పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ధ్యాన ఔత్సాహికులు హాజరయ్యారు.

Pages