S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/30/2018 - 04:13

సంగారెడ్డి టౌన్, మే 29: త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) కృషి చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర యువత టీజేఎస్ వైపే చూస్తుందని, వారి సమస్యలే ఎజెండాగా పని చేస్తామన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటుచేసిన టీజేఎస్ జెండా ఆవిష్కరణలో కోదండరాం ఆయన మాట్లాడారు.

05/30/2018 - 04:09

సంగారెడ్డి, మే 29: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిద్దిపేటకు మంజూరైన మెడికల్ కళాశాల యేడాది కాలంగా సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద చిచ్చుపెట్టి కూర్చుంది.

05/30/2018 - 03:52

విజయవాడ, మే 29: హైదరాబాద్ నగరం నా మానసపుత్రిక.. ఐటీ పార్క్, సైబరాబాద్ నగర నిర్మాణాల వలనే నేడు తెలంగాణ ఆదాయంలో 70 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడులో మూడోరోజున మంగళవారం టీఆర్‌ఎస్ పాలనలో కొరవడిన సామాజిక న్యాయం - అప్రజాస్వామిక విధానాలు, అస్తవ్యస్త పాలన .. తీర్మానంపై జరిగిన చర్చల్లో బాబు పాల్గొన్నారు.

05/30/2018 - 03:31

హైదరాబాద్, మే 29: రాష్ట్రంలోని వివిధ పాంతాల్లో నిర్మిస్తున్న పారిశ్రామిక పార్కులను వేగవంతంగా ని ర్మించి అందుబాటులోకి తేవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టీఎస్‌ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంతో పాటు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల నిర్మాణ పనుల పురోగతిని ఆయన తెలుసుకున్నారు.

05/30/2018 - 03:29

హైదరాబాద్, మే 29: రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ పని తీరును మరింత మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌డీఎంఆర్‌సీ (లీడర్షిప్ డెవలప్‌మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్ కానిస్టేనె్సస్) పని తీరు చాలా బాగున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

05/30/2018 - 03:27

హైదరాబాద్, మే 29: దేశంలో ప్రధాన నగరాల్లో ‘సిటీ గ్యాస్ పంపిణీ’ కోసం వేలం పాటలు నిర్వహించడానికి రోడ్డు- షోలు నిర్వహిస్తున్నట్లు పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ అథారిటీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సిటి గ్యాస్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలంగాణాప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

05/30/2018 - 03:27

ధర్మపురి, మే 29: స్థానిక సంస్థల ప్రధానంగా పంచాయతీ ఎన్నికలను జూలై మాసంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, తదనుగుణంగా వడివడిగా చర్యలు తీసుకుంటుండగా, రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కిరాకుండా ఉంది. దానితో సంబంధిత ఎన్నికలకై సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్‌ల స్థిరీకరణ నిబంధనల గురించి అన్ని రాజకీయ పార్టీల నాయకులలో, ప్రధానంగా ఆశావహులలో సర్వత్రా చర్చలు చోటు చేసుకుంటున్నాయి.

05/30/2018 - 03:25

హైదరాబాద్, మే 29: తెలంగాణలో భవనాలు, ఇతర నిర్మాణాలకు కృత్రిమ ఇసుకను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 37) జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నదు లు, వాగుల్లో లభించే ఇసుక ప్రజల అవసరాలకు తగ్గట్టు అందుబాటులో ఉండకపోవడం వల్ల కృత్రిమ ఇసుకను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.

05/30/2018 - 03:24

హైదరాబాద్, మే 29: గ్రామ పంచాయతీలు తమ ఆర్థిక వనరులను పెంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ సర్పంచ్‌లకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుం డి ఎంపికచేయబడ్డ కొంతమంది గ్రామ సర్పంచ్‌లతో మంగళవారం ఆయన చర్చించారు. రాజేంద్రనగర్‌లోని ‘సిపార్డ్’ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) లో జరిగిన సమావేశంలో ఆర్థిక వనరులపై చర్చ జరిగింది.

05/30/2018 - 03:22

హైదరాబాద్, మే 29: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అలసత్వం పట్ల ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు పరిహారాన్ని నిర్ణీత కాలపరిమితిలో ఎందుకు చెల్లించడం లేదని కలెక్టర్లు, ఎస్‌పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రశ్నించారు.

Pages