S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/30/2018 - 03:21

న్యూఢిల్లీ,మే 29: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందకు కమిషన్ ఏర్పాటు కుదరదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఏన్జీటి) స్పష్టం చేసింది.కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఏన్జీటిలో దాఖలైన పిటిషన్ జస్టిస్ జావేద్ రహిం నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.

05/30/2018 - 03:20

హైదరాబాద్, మే 29: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ 2019 శాసనసభ ఎన్నికల విజయానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేసి దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ చేపట్టినట్టు లక్ష్మణ్ తెలిపారు.

05/30/2018 - 03:19

హైదరాబాద్, మే 29: నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయని వర్క్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని మిషన్ భగీరథ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ లిస్టులో పెట్టిన ఏజెన్సీలు భవిష్యత్‌లో ప్రభుత్వంలో మరే ప్రాజెక్టులో పని చేయకుండా నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేము ల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో ప్రశాంత్‌రెడ్డి సమీక్షించారు.

05/30/2018 - 03:19

హైదరాబాద్, మే 29: దేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూ రో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండో విడత సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విద్యా, న్యాయవ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు.

05/29/2018 - 23:40

హైదరాబాద్, మే 29: దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలన్నింటికి న్యాయం చేసేందుకు జాతీయ స్థాయిలో ఓబీసీలను శాస్ర్తియంగా విభజించాలని డిమాండ్ చేస్తూ జూన్ 24న ఢిల్లీలో ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

05/30/2018 - 02:20

కరీంనగర్ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పేద, మధ్య తరగతి రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో భాగంగా డయాలసిస్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్‌ల ను ప్రారంభించారు.

05/29/2018 - 04:18

కోరుట్ల, మే 28: తెలంగాణ ఉద్య మంలో.. రాష్ట్ర ఏర్పాటులో కీల కపాత్ర వహించిన జర్నలిస్టుల సేవలు గుర్తించి జగిత్యాల జిల్లా కోరుట్లలో వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామ ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం కోరుట్ల శివారు వెంకటసాయినగర్‌లో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు.

05/29/2018 - 04:16

మహబూబ్‌నగర్, మే 28: తెలంగాణ వచ్చింది కుటుంబపాలన కోసం కాదని కుటుంబపాలనకు చరమగీతం పాడేందుకు యావత్తు తెలంగాణ సమాజం అంతా నడుం బిగించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని అల్మస్ ఫంక్షన్‌హల్‌లో టీజెఎస్ ఒకరోజు శిక్షణ తరగతుల కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

05/29/2018 - 04:12

కౌటాల (ఆసిఫాబాద్), మే 28: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత సంగమ స్థానంలో నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి ప్రాణహిత సాగు నీటి ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రాణహిత ప్రాజెక్ట్ పై ప్రశ్నలు లెవనెత్తుతున్న వేళ.. మరోసారి ప్రభుత్వం విమర్శలు తిప్పి కొట్టేందుకు అడుగులు ముందకేస్తున్నట్లుగా తెలుస్తుంది.

05/29/2018 - 04:12

దేవరకొండ, మే 28: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద త్వరలో రాష్ట్రంలో 5 వేల నాటు యంత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Pages