S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/02/2018 - 01:37

హైదరాబాద్, జూన్ 1: క్రికెటర్ హార్ధిక్ పాండ్య ఒక ఓవర్ బౌలింగ్‌కు ఎంత సమయం తీసుకుంటాడో అంతే సమయంలో నాలుగు ట్రక్కుల వ్యర్థపదార్థాలు సముద్రంలో కుప్పపోస్తున్నందున పర్యావరణానికి పెద్ద ప్రమాదం ఉందని అంతర్జాతీ పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక సంవత్సరంలో 13 మిలియన్లు( ఒక బిలియన్ వంద కోట్లు లేదా వెయ్యి మిలియన్లు) టన్నుల ప్లాస్టిక్‌తో పాటు చెత్తను సముద్రంలోకి కుమ్మరిస్తున్నారు.

06/02/2018 - 01:31

హైదరాబాద్, జూన్ 1: నాలుగేళ్ల పాలనలో చిన్నపాటి అవినీతి, అక్రమాలు లేకుండా ఎంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోతున్నారని, దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే దానికి మోదీ అవినీతి రహిత పాలనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిందని చెప్పారు.

06/02/2018 - 01:30

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాదుల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎంపీ వినోద్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

06/02/2018 - 01:29

హైదరాబాద్, జూన్ 1: కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణలో గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది శూన్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరని అన్నారు.

06/01/2018 - 02:44

వరంగల్, మే 31: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోని 29 రాష్ట్రాలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారని రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కార్మిక మహోత్సవ ముగింపు సభ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో జరిగింది.

06/01/2018 - 02:42

నర్సంపేట, మే 31: రైతుల పట్ల కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమి లేదని రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు.

05/31/2018 - 23:19

హైదరాబాద్, మే 31: స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మహిళా సాధికారతకు చిహ్నంగా స్వయం సహాయ మహిళా గ్రూపులను చూపుతున్నప్పటికీ, ఆచరణలో వీరికి ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/31/2018 - 23:18

సిద్దిపేట, మే 31: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 83 రూపాయలకు పైగా పెంచి.. కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గించి రాజకీయం చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత్‌రావు అన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని మోదీ సర్కార్ 60 పైసలు తగ్గిద్దామనుకున్నామని, కానీ ఒక్క పైసా మాత్రమే తగ్గించామని చెప్పటం శోచనీయమన్నారు.

05/31/2018 - 23:15

హైదరాబాద్, మే 31: ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ పతనానికి నాంది అని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్టల్రో ఘోర పరాజయం పాలైందని వివరించారు.

05/31/2018 - 23:15

సంగారెడ్డి, మే 31: వివాదాస్పదంగా మారిన సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరుకు ముఖ్యమంత్రి వస్తేకానీ తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. జనాకర్షక పథకాలతో ప్రజలను తమవైపు తిప్పుకుని మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులు సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి చిత్తవుతున్నాయి.

Pages