S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/22/2018 - 04:29

భువనగిరి, ఏప్రిల్ 21: మూడున్నర సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను తెలంగాణాలో ఏర్పాటుచేసేందుకు పరిపాలనామోదం తెలిపిందని భువనగిరి పార్లమెంట్ సభ్యుఆ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. స్థానిక రహదారి బంగ్లాలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు ఎయిమ్స్ రావడం రాష్ట్ర ప్రభుత్వ విజయమన్నారు.

04/22/2018 - 04:26

సిరిసిల్ల, ఏప్రిల్ 21: తమ హక్కు ల సాధన చేపట్టిన ఉద్యమంలో భాగంగా మే 5న ‘కరీంనగర్ రెడ్ల కథన భేరి’ సభను నిర్వహిస్తున్నామని, దీనిని ఉమ్మడి జిల్లాలోని రెడ్డి సోదరులు విజయవంతం చేయాల ని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షు లు చక్రధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక స్థానిక సిరిసిల్ల ఫంక్షన్ హాలులో రెడ్ల కథన భేరి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు.

04/22/2018 - 04:11

హైదరాబాద్/కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 21 : దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ముందుకు రావాలని భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కూకట్‌పల్లి జే ఎన్‌టీయూహెచ్‌లో మల్లారెడ్డి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

04/22/2018 - 04:08

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ-కేరళ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను పరస్పరం బదిలీ చేసుకుందామని ఇరు రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రులు నిర్ణయించారు. కేరళ రాష్ట్ర బలహీనవర్గాలు, గిరిజన, షెడ్యూలు కులాల సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి ఏకె బాలన్ శనివారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను కలిసి చర్చలు జరిపారు.

04/22/2018 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 21: కేరళ వైద్య ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని శనివారం కలిసి చర్చలు జరిపారు. లక్ష్మారెడ్డి అధికార నివాసంలోనే ఈ చర్చలు జరిగాయి. హైదరాబాద్ వచ్చిన శైలజ మర్యాద పూర్వకంగా లక్ష్మారెడ్డిని కలిశారని అధికార వర్గాలు వెల్లడించాయి.

04/22/2018 - 04:01

హైదరాబాద్, ఏప్రిల్ 21: పౌరులు తమ హక్కుల కోసం, ప్రశాంత జీవనం కోసం పోరాటం చేయాల్సిందేనని, లేకుంటే ఏ ప్రభుత్వమూ దిగిరాదని ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ న్యాయకోవిదుడు ఎంసీ మెహత పేర్కొన్నారు. భారతదేశంలో పర్యావరణ చట్టాలలో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు గత 40 ఏళ్లుగా పోరు సాగిస్తున్న మెహత శనివారం విలేఖరులతో మాట్లాడారు.

04/22/2018 - 04:01

హైదరాబాద్, ఏప్రిల్ 21: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యురాలిగా అన్యమతానికి చెందిన అనితను నియమిస్తారా? అని బీజేపీ సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ ఎంవి శేషగిరి రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను పవిత్ర క్షేత్రంగా భావించే హిందువులను అవమానించడమేనని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

04/22/2018 - 04:00

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ పాలిసెట్ శనివారం రాష్టవ్య్రాప్తంగా ప్రశాంతంగా జరిగిందని సెట్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ చెప్పారు.

04/22/2018 - 04:00

హైదరాబాద్, ఏప్రిల్ 21: నాసిరకం క్రిమి సంహారక పురుగు మందులు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ (సస్య రక్షణ) అదనపు సంచాలకుడు-2 తెలిపారు.

04/22/2018 - 03:59

హైదరాబాద్, ఏప్రిల్ 21: బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల సబ్సిడీ రుణాల చివరి గడువును 15 రోజులకు పొడిగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Pages