S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/08/2018 - 03:13

హైదరాబాద్, ఏప్రిల్ 7: శామీర్‌పేటలోని జినోమ్ వ్యాలీని శనివారం చైనా జర్నలిస్టుల బృందం సందర్శించింది. లైఫ్ సైన్సైస్ రంగంలో చైనాకు దీటుగా ఇండియా ఎదుగుతోందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైనె్సస్‌తో పాటు ఫార్మా సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. జినోమ్ వ్యాలీ ఉపాధ్యక్షులు ఎకే.సింగ్ జినోమ్ వ్యాలీలో అంతర్జాతీయ స్థాయిలో వౌలిక వసతులు కల్పిస్తున్నామని జర్నలిస్టుల బృందానికి వివరించారు.

04/08/2018 - 03:12

హైదరాబాద్, ఏప్రిల్ 7: టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో శనివారం క్రీడా మంత్రి పద్మారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్లోలో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి అక్కడి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.

04/08/2018 - 03:09

హైదరాబాద్, ఏప్రిల్ 7: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషిని కోరారు. శనివారం కిసాన్, ఖేత్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ ఎం. కోదండరెడ్డి, పార్టీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేసింది.

04/08/2018 - 03:08

హైదరాబాద్, ఏప్రిల్ 7: బస్తీల్లో ప్రారంభించిన దవాఖానాలను పేదలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శనివారం మంత్రి తలసాని సచివాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిథిలో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాలపై స్థానిక కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షించారు. బస్తీ దవాఖానాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రజలకు వైద్య సేవలందిస్తాయని మంత్రి తెలిపారు.

04/07/2018 - 04:50

మెదక్ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ మది లో నుండి పుట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి రోల్‌మోడల్ లాంటిదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో 965 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు జరుగుతుండగా ఇప్పటికే 659 గ్రామాలకు నీటిసరఫరా జరుగుతుంది, మిగతా 303 గ్రామాలకు 25 రోజుల్లో ఇస్తామని ప్రకటించారు.

04/07/2018 - 04:32

హైదరాబాద్, ఏప్రిల్ 6: జూన్ మాసంతానికి పది కోట్ల పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరిత హారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

04/07/2018 - 04:31

నిజామాబాద్, ఏప్రిల్ 6: జిల్లా కేంద్రంలోని మాలపల్లి ప్రాంతంలో గల మదర్సాలో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటిన జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి.

04/07/2018 - 04:27

మెదక్, ఏప్రిల్ 6: కాంగ్రెస్ వారు కళ్లులేని కబోదులని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణం లో 45.65 లక్షలతో నిర్మించిన డీఎస్పీ భవనాన్ని మంత్రి హరీష్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రాజమణి మురళీయాదవ్‌లతో కలిసి హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/07/2018 - 04:24

శాయంపేట, ఏప్రిల్ 6: గత 50 ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే కేవలం నాలుగు ఏండ్లలో నాలుగు రెట్ల అభివృద్ధి జరిగిందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాయంపేట మండలంలోని నూర్జాహాన్‌పల్లి గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసేందుకు వచ్చిన స్పీకర్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ మాజీబాయి ఇంట్లో స్పీకర్ పల్లె నిద్ర చేశారు.

04/07/2018 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రపంచ స్థాయి ఐటీ సిటీగా హైదరాబాద్ ఎదుగుతోందని చైనా పాత్రికేయుల బృందం ప్రశంసించింది. హార్ట్‌వేర్ రంగంలో చైనా, సాఫ్ట్‌వేర్‌లో భారతదేశం ముందున్నాయని, పరస్పరం సహకరించుకుంటే ఇరుదేశాల్లో మరింత అభివృద్ది సాధ్యమవుతుందని కూడా వ్యాఖ్యానించింది. శుక్రవారం నగరంలోని టీహాబ్, టీసీఎస్, ఐఎస్‌బీల సందర్శన కోసం ఈ బృందం నగరానికి విచ్చేసింది.

Pages