S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/09/2018 - 01:17

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై సభా కమిటీచే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన తాగునీరు అందించే లక్ష్యంతో సాగుతున్న పనుల్లో భారీగా అవినీతి - అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.

04/09/2018 - 01:17

హైదరాబాద్, ఏప్రిల్ 8: భారత్ బంద్ సందర్భంగా పోలీస్ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందడాన్ని నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు.

04/09/2018 - 01:16

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్రం నుంచి హాజ్ యాత్రకు వెళుతున్న వారు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసి ఉల్లాఖాన్ సూచించారు. ఆదివారం బాలానగర్‌లో హాజ్ యాత్రకు వెళుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. దేశం కాని దేశంలో ఏదైనా ఆనారోగ్యానికి గురి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

04/09/2018 - 01:16

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా, స్వేచ్ఛగా సేవలు అందించేందుకు పౌర సేవల హక్కు చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని, ఉంటాయని, అందుకోసం పౌర సేవల చట్టాన్ని తీసుకువస్తామని గతంలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

04/09/2018 - 01:15

హైదరాబాద్, ఏప్రిల్ 8: అరేబియా సముద్రంతో పాటు మహారాష్ట్ర, విదర్భ, మధ్యప్రదేశ్, కర్నాటకలో ఏర్పడ్డ తుపాను ద్రోణి ప్రభావంతో తెలంగాణలో గత రెండురోజుల నుండి వాతావరణం కొద్దిగా చల్లబడింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

04/09/2018 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నియోజకవర్గానికి 150 మంది ప్రతినిధుల చొప్పున 15 వేల మంది ప్రతినిధులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వానించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.

04/09/2018 - 04:17

హైదరాబాద్: జన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ అడుగు వేస్తే, తామూ కలిసి నడవాలన్నది సిపిఎం నేతల మనోగతం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ తెలంగాణ వైపు దృష్టి సారించడం లేదు. ఆంధ్రలో పవన్‌తో జత కట్టి నడుస్తున్న సిపిఎం నేతలకు తెలంగాణ విషయంలో పవన్ ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు.

04/09/2018 - 01:12

హైదరాబాద్, ఏప్రిల్ 8: దేశంలో ఏ రాష్ట్రం పెంచని విధంగా హోంగార్డులకు జీతాలు పెంచి వారిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ రవీంధ్రభారతిలో తమ జీతాలు పెంచినందుకు హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో పోలీసు శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌తో నోటిఫికేషన్ విడుదల అవుతుందని అన్నారు.

04/09/2018 - 00:25

సంగారెడ్డి, ఏప్రిల్ 8: వారం రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందన్న ఊరట మినహా రైతాంగానికి నష్టాన్ని కల్పించింది. చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉరుముల శబ్దం బాంబు లు మోగినట్లు వినిపించాయి.

04/09/2018 - 00:24

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8: తరుచూ కరువుకాటకాలు, వలసలు ఏళ్ల తరబడి వెంటాడుతున్న అప్పుల బాధలు, సాగు చేసిన పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు ఆత్మహత్యలకు నిలయంగా మారిన పాలమూరు జిల్లాపై మరోసారి ప్రకృతి కనె్నర్ర జేసింది. ఏటా ఏదో రకంగా రైతులను తీవ్రంగా కృంగదీస్తున్న ప్రకృతి ఈ దఫా సైతం వదిలిపెట్టలేదు. యాసంగి సీజన్ మొదట్లో ప్రకృతి సహకరించడం.. దాంతో రైతులు పెద్దఎత్తున పంటలను సాగు చేశారు.

Pages