S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/07/2018 - 04:20

ఘకరీంనగర్ టౌన్, ఏప్రిల్ 6: రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్న సామాజిక వర్గం బడుగు, బలహీన వర్గాలను అణచివేతకు గురిచేస్తూ రాజ్యాధికారం కొనసాగిస్తోందని, దీనిని దేశవ్యాప్తం చేసే క్రమంలో ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని సాంస్కృతిక ఫెడరలిజం అధికంగా ఉన్న దేశంలో ఈ ఫ్రంట్ ఫెయిల్యూర్ కావటం తథ్యమని ప్రజాయుద్ధ నౌక గద్దర్ జోస్యం చెప్పారు.

04/07/2018 - 02:39

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరిచింది. తెలంగాణ ఆవిర్భావం, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి టిఎస్‌ఐ పాస్ చట్టాన్ని తెచ్చారు. దీని వల్ల 6206 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తం రూ.1.18 లక్షల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 4.47 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.

04/07/2018 - 02:37

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ పోలీస్ శాఖ గన్ లైసెన్సుల జారీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎంతో అవసరమైతే తప్ప గన్ లైసెన్సులు జారీకి అనుమతి ఇవ్వడం లేదు. గన్ లైసెన్సులు పొం దిన కొంతమంది ఇటీవల ఆత్మరక్షణకు వినియోగించాల్సిన ఆయుధాలను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉండడంతో కొన్ని నెల ల నుంచి గన్‌లైసెన్సుల జారీని కట్టుదిట్టం చేశారు. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సైతం కఠి న తరం చేసింది.

04/07/2018 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రత్యేక హోదా సాధనపై పలుమార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం అంటే ఎవరు నమ్ముతారని వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజల అభిప్రాయాన్ని అడుగుదామని సూచించారు.

04/07/2018 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 6: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజురు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను చేపట్టడానికి రూ.285.93 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చినట్టు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేసారు.

04/07/2018 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ మార్పు, థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త పాట పాడుతున్న ముఖ్యమంత్రి ఎవరి కోసం మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

04/07/2018 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 6: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటుల్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని ఎపీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలో జరిగిన సమావేశానికి 64 బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.

04/07/2018 - 02:31

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ వై.వెంకట్వేశరరావు గతంలో నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండగా అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సస్పెండ్ చేసిం ది.

04/07/2018 - 02:30

హైదరాబాద్, మార్చి 6: మేధోసంపత్తి హక్కులలోని వివాదాలను పరిష్కరించే అత్యుత్తమ పద్ధతులు అనే అంశంపై ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ రిసొల్యూషన్ సంస్థ( ఐసీఏడీఆర్) ఈ నెల 28న జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఐసీఏడీఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ పద్ధతులను ప్రచారం చేయడానికి 1998లో స్థాపించడం జరిగిందని సంస్థ ప్రాంతీయ కార్యదర్శి జేఎల్‌ఎన్ మూర్తి చెప్పారు.

04/07/2018 - 02:30

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో సుమారు లక్ష ఎకరాల పంట దెబ్బతిన్నదని టీటీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట దెబ్బతిని కుదేలైన రైతులను ఆదుకోవాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ ఎమ్మెల్యే సం డ్ర వెంకట వీరయ్య ప్రభృతులు శుక్రవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. 72,632 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని వారు తెలిపారు.

Pages