S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

06/18/2017 - 22:21

హరహమూ, అనుక్షణమూ భవ్య కవితావేశంతో తెలుగు నేలను తన కవిత్వ ప్రవాహంతో ప్లావితం చేసిన గొప్ప కవి సి.నారాయణరెడ్డి. ఆయన అస్తమయం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శకానికి చరమగీతం పాడింది. దాశరథి, నారాయణరెడ్డి అన్నదమ్ముల వలె తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించినప్పటికి అది భావకవిత్వం తొలగిపోయి ప్రగతివాద కవిత్వం పెంపొందించుకుంటున్న కాలం. అది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలం కూడా.

06/18/2017 - 22:17

తేజోవంతమైన దీపంలా ముఖం
నిట్టనిలువు ఎండ సోకని దేహం
చిరు ఉద్వేగాల కంపనానికి
చెమ్మగిల్లి గుండె చెరువై
ఊగిపోయే ఊరిపోయే
ఆర్ద్రమయ్యే కళ్ళు
ఊకలు విసిరికొడితే చాలు
కందిపోయే కమిలిపోయే చర్మం

వర్షం కడిగిన పచ్చని చెట్టులా
స్వచ్ఛ స్పటిక నిగారింపు
రోజంతా తాజాతనం
పక్కన కూర్చుంటే చందన పరిమళం

06/18/2017 - 22:15

కవిసంధ్య కవిత్వ ద్వైమాసిక పత్రిక జూన్, జూలై 2017 సంచిక సినారె స్మారక ప్రత్యేక సంచికగా వెలువడుతుంది. ఈ సంచిక కోసం సినారెతో గల తమ సాహిత్య అనుభవాలను, సినారె సాహిత్యంపై వ్యాసాలను, కవితలను ఆహ్వానిస్తున్నట్లు కవిసంధ్య సంపాదకుడు డా. శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు. పత్రిక సైజు, పుటలను దృష్టిలో పెట్టుకుని సంక్షిప్త రచనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తమ రచనలను 24-6- 2017లోపు ఎడిటర్, కవిసంధ్య, డోర్ నెం.

06/18/2017 - 22:14

1970లో డా.సి.నారాయణరెడ్డిగారు ప్రచురించిన కావ్యం ‘మంటలూ -మానవుడూ’. ఇది ఆయన రాసిన 30 కవితల సంకలనం. ఇందులోని ప్రతి కవితా అభ్యుదయ పరిమళంతో అలరారుతు సామాజిక మార్పును ఆకాంక్షగా ప్రకటిస్తున్నది. ఈ కావ్యం వచ్చి నాలుగున్నర దశాబ్దాలు గడిచిపోతున్నా ఇందులోని కవితలు సామాజిక స్వభావాన్ని కోల్పోలేదు. ఈ కావ్యంలో కవి విమర్శనాత్మకంగా చిత్రించిన రాజకీయార్ధిక సాంఘికాంశాలు ఏదో ఒక రూపంలో ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.

06/11/2017 - 21:02

రసభావం- అనౌచిత్యమున ప్రవర్తిల్లినచో రసాభాసమవుతుంది. అనౌచిత్యమనగా లోకమర్యాదను అతిక్రమించడం. పెద్దలను గౌరవించడం లోకమర్యాద. అపహాస్యము చేయగూడని గురువులు, పెద్దలు, దేవతలు మున్నగువారిని ఆలంబనం చేసుకుని ప్రవృత్తమైన హాస్యం, రసాభాసమవుతుంది.

06/11/2017 - 21:00

అనకాపల్లినుంచి విశాఖపట్టణానికి వచ్చాడు నూకరాజు. అతని వెంట అతని భార్య కూడా ఉంది. నగరంలో ఓ సినిమా చూచి, రాత్రంగా హాయిగా ఓ హోటల్ గదిలో గడిపి తిరిగి తన ఊరుకు వెళ్లిపోవాలని అతని అంచనా. కానీ, మనుషులు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు. ఊహించుకున్నవన్నీ ఉయ్యాలలో ఊగించవు. ‘అంతఃపుర ద్రోహి’లా కనిపించాడు నూకరాజు, తన బీద దుస్తుల్లో ఆ హోటల్ గుమాస్తాకు.

06/11/2017 - 20:59

తపించిపోతున్న ఆవిరి
ఆత్మత్యాగాన్నందిపుచ్చుకొని
మేఘం
నేల మీద చినుకు దోసిలి విప్పటమే
కర్తవ్యోపమ... అప్పుడే కద
ఆకాశం జలప్రవాహమై భూగోళాన్ని
కశ్మల రహితంగా కడిగేది
తడిసి మనిషి తరువయ్యేది...

06/11/2017 - 20:59

ఆషాఢం తొలివారం
రుతు పవనాల సౌహార్దంతో
వినువీధిలో పెను సంరంభం
మేఘ గర్జనలతో
ఉరుములు మెరుపుల విన్యాసాలు
తొలకరి పలకరిస్తుంది
చిరుజల్లుల వయ్యారాలకు
పుడమి పులకిస్తుంది
విత్తనం అంకురించి
నేల తల్లికి ప్రణమిల్లుతుంది
శ్రావణ భాద్రపదాల వర్షధారలతో
పొలాలన్నీ పచ్చదనంతో పరవశిస్తూ
వ్యవసాయం ఫలసాయమై
రైతన్న వదనం వికసిస్తుంది

06/11/2017 - 20:58

చూడటానికి చువ్వలా ఉన్నా
పది మందిలో ప్రత్యేకంగా కనిపించేది అమ్మమ్మ
కారణం ఆమె నడుముకున్న వడ్డాణమే
శివుని మెడలో నాగరాజులా
ఎపుడూ ఆమె నడుమును అంటిపెట్టుకునే ఉండేది
అమ్మమ్మ పెళ్ళిలో పుట్టింటి వారు పెట్టిన
ఇరవై తులాల వడ్డాణం
ఆమె తనువులో ఓ భాగమైపోయింది
తాతయ్యనైనా విడిచి ఉండేది కాని
వడ్డాణాన్ని మాత్రం వదిలేది కాదు స్నానమాడే వేళ తప్ప

06/04/2017 - 21:01

మూర్ఖుడి వేదాలు వేరు
వాదనలు వేరు
చేతనలు వేరు
సాధనలు వేరు
మూర్ఖత్వం మెదడులో
తెరలు తెరలుగా
గుండెల్లో
పొరలు పొరలుగా
ఒకచోట ఘనీభవించి
ఒకచోట ద్రవీభవించి-
తెరతీస్తే మరో తెర
పొరతొలిస్తే మరో పొర
పగలేస్తే పగలని లోహం
పారిస్తే పారని ద్రవం-
భక్తి మూర్ఖత్వం
మత మూర్ఖత్వం
జ్ఞాన మూర్ఖత్వం
దృష్టి మూర్ఖత్వం

Pages