S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

11/19/2017 - 22:15

శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా...
*

11/19/2017 - 22:01

చింపిరి తల
చిరిగిన బట్టలు
చావిట్లో విరిగిన నులక మంచం
ఏ గుడిసె చూసినా
ఏముంది గర్వకారణం?
ఎండిన డొక్కల్లో పొడి పొడిగా
రాలిపడే ఆకలి రజను తప్ప

11/19/2017 - 21:59

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరి తనమెందుకో
ఒక్కోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురు తిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికి మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోని నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

11/19/2017 - 21:57

తెలిమబ్బులతో దాగుడు మూతలాడుతున్న
వెనె్నల రేకుల మీదుగా
సౌందర్యపు అపరిమితత్వాన్ని ప్రణవిస్తూ
నక్షత్రాల తమకాలలో జారిపడిన సవ్వడిలో
ప్రకృతికి మెత్తని చలనాన్ని స్తూ
రేయి చిక్కబడింది

11/19/2017 - 21:55

తెనుగు లెంక ‘‘తుమ్మల సీతారామమూర్తి రచనలు- సామాజిక సందేశం’’ అన్న అంశంపై రాష్టస్థ్రాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చీరాల - కళాంజలి సంస్థ అధ్యక్షులు కాకరపర్తి వేంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పదిపేజీలకు మించకుండా (అచ్చులో 5 పేజీలు) వ్యాసం రాసి డిసెంబరు 15లోగా అధ్యక్షుడు, కళాంజలి, ముత్యాల పేట వీధి, చీరాల - 523155 ప్రకాశంజిల్లా చిరునామాకు హామీపత్రం తోపాటు పంపాలి.

11/19/2017 - 21:55

సంగీతం, సంస్కృతి, బాలల సంక్షేమం వంటి రంగాలలో ముంబయి కేంద్రంగా నిరంతరం కృషి చేస్తున్న పద్మబినాని ఫౌండేషన్ ‘వాత్సల్య పురస్కారం’ కోసం రచనలను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ లోగడ వివిధ భాషల్లో బాల సాహిత్యంలో కృషి చేసినవారికి లక్షరూపాయల పురస్కారాన్ని అందచేసింది. అదే మొత్తాన్ని ఈ ఏడాది 2017కి గాను తెలుగులో బాల సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేసినవారికి పురస్కారంగా ఇవ్వాలని నిర్ణయించారు.

11/19/2017 - 21:54

‘నాది నమ్మకం మూఢత్వం కాదు.. మా ఇంట్లో వాతావరణం వల్ల నాకు కొన్ని అలవాట్లు వచ్చాయి. కానీ వాటికి అర్థం తెలియకుండా నేను ఆచరించే రకాన్ని కాదు. గాలిలో మంచి చెడూ వైబ్రేషన్స్ రెండూ వుంటాయి. కేవలం మంచిని వైబ్రేట్ చేయగల ఏంటెనా లాంటి వస్తువులను ఆచారంగా చేశారు మనవాళ్లు. మన చుట్టూ వాతావరణం అంతా ఏటమ్స్‌తోను, సబ్ ఎటామిక్ పార్టికల్స్‌తోను నిండి వున్నాయి. అవునని సౌండ్ దానిని వైబ్రేట్ చేస్తుంది.

11/05/2017 - 21:19

సమకాలీన అంశాలను స్పృశించడంతోపాటు సందేశాత్మక రీతిలో రచనా వ్యాసంగం చేయడమే సాహితీ ధర్మం. కేవలం రాయాలని రాయడం వల్ల ఆ రాతల్లో సార్థకత ఉండదు. ప్రతి మాట, ప్రతి పదం సామాజిక చైతన్యం కలిగించినప్పుడే ఏ రచయిత అయినా పదికాలాల పాటు రాణించగలుగుతారు. భారతదేశం భిన్న సంస్కృతుల మేళవింపు. ఇలాంటి అరుదైన సాహితీ సవ్యసాచి కృష్ణాసోబ్తి.

11/05/2017 - 21:17

నేను
నా ఎదని కన్నీళ్ళలో నానబెట్టాను

నా చర్మం చినిగి పాడైపోయింది
అదింకా దుఃఖంలో సజీవంగానే ఉంది

నా కళ్ళు సిగ్గుపడుతున్నట్లూ
నటిస్తున్నాయి

అనుభూతుల ఆర్ణవాల్ని
నాలోనికి స్వాగతిస్తున్నాను

నేనిప్పుడు శిక్షణ కోసం పోవాలి
ఎలా దుఃఖించాలో అని

నాలోనికి ఓ మనిషిని
పూలదండలా ధరించాలి
నన్ను నేను బలపరుచుకోవడానికి

Pages