S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

04/16/2017 - 21:52

ఏ ప్రక్రియకు సంబంధించినా గత అయదేళ్లలో అచ్చయన వ్యాఖ్యాన గ్రంథాలను ద్వానా సాహితీ కుటీర పురస్కారాలకు పంపించాలని కినె్నర ఆర్ట్ ధియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ప్రతుల చొప్పున కింది చిరునామాకు మే 15వ తేదీలోగా పంపించాలి. పురస్కారం కింద పదివేల నగదు, జ్ఞాపిక అందజేయబడును.

04/16/2017 - 21:52

‘మట్టి తడి బంధాల్లో’ (కవితా సంపుటి) మొలకెత్తిన కొండ్రెడ్డి సాహిత్యం చిగిరింతలు (నానీలు)తో చింతనలు (నానీలు) తోనూ-తొమ్మిది కవితా సంపుటాలతో, సంస్పర్శ, ఆలోకనం వ్యాసాలతో నవనవోనే్మషమై అనంతానే్వషణ దిశగా పయనిస్తోంది. నవ దృక్పథం సాహిత్య వ్యాసాలలో ‘అనంతానే్వషణ దిశగా’...మొదటి శీర్షిక.

04/09/2017 - 22:11

వెండి గొలుసుల లంకె వేసి
ప్రచండమగు నీ నీలి తెరల
తూర్పు వాకిలి తలపు రెక్కల
తొలగ లాగెదరెవ్వరో
- అంటూ గత శతాబ్దం తొలి నాళ్ళలోనే తెలుగు వాకిట నవకవితా యుగోదయానికి బాటలు వేసిన యుగకర్త యుగోదయ ద్రష్ట భావకవితా పితామహుడు, ప్రముఖ కవి దార్శనికుడు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు.

04/09/2017 - 22:09

దుఃఖించే ప్రతి సందర్భంలో కారే కన్నీరు
అక్కరకు రాని అకాల వర్షం లాంటిది.
దుఃఖించే కారణం
మహాసముద్రమంత లోతైనదై ఉండాలి!
వ్యధ ఆవర్తనమై కొనసాగాలి.
పీడించే జ్ఞాపకాలు కన్నీటి సుడులై తిరగాలి.
దానికి దుఃఖం వాయువులా
తోడై గుండంలా మారాలి!
స్పష్టమైన వినీలాకాశం
మేఘావృతమై మసకేసినట్లు,
రెప్పచాటు యదార్ధం
అశ్రురూపధారియై అస్పష్టమవ్వాలి!

04/09/2017 - 22:08

మెను పురాణేతిహాసాలలో
తిరుగులేని ఆధిక్యతను ప్రతిష్టించి
వర్తమానంలో దగాచేస్తాం
అరచేతి వైకుంఠంలో
ఆకాశమంత ఎత్తున అధిష్టింపజేసి
ఆచరణలో అర్ధబానిసను చేస్తాం
నియమాలు, నిషేధాలు ఆమె చుట్టూ
సంకెళ్ళుగా బిగించి
మన పరిధికి హద్దులు చెరిపేసుకుంటాం
ఆమె బతుకులో కట్నాల కష్టాలు పేర్చి
ఆమెలో మానసిక అశాంతిని రగిలిస్తాం
ఐనా... ఆమె

04/09/2017 - 22:06

మహాకవి శ్రీశ్రీ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 30న విజయవాడలో శతాధిక కవి సమ్మేళనం జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని కవులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. సమాజము, సంస్కృతి, చదువు, సౌందర్యము, కళ, సాహిత్యానికి సంబంధించి శ్రీశ్రీ స్పందనలకు కవిత్వ రూపం ఇవ్వాలని యువసాహితీ వికాస వేదిక సాంస్కృతీ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. కవి సంగమంలో పఠనం చేసిన కవితల సంకలనాన్ని సాహితీ స్రవంతి పేరుతో ప్రచురిస్తారు.

04/09/2017 - 22:05

జనవంశమ్ (కావ్యకృతి)
కవి: శేషేంద్ర
పుటలు; 272 వెల: రూ.450;
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
**

04/03/2017 - 14:34

1938లో విశాఖపట్నం నుంచి ఒక యువ కవి దేశ చరిత్రలు గీతం రాస్తూ, ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెల్గులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం?’’ అని చివరి చరణంలో ప్రశ్నలు వేస్తాడు. దీనికి వందేళ్ల వెనకాల 1836లో, చదువులు లేవు. బడులు లేవు, తీర్చిన పాఠ్య ప్రణాళికలు లేవు, అక్కడక్కడా అయ్యవార్లు నడిపే బడులు తప్ప.

04/03/2017 - 14:32

పేరుకు కాగితమైతేనేం
అది అక్షరాలు ఆడుకునే ఓ క్రీడాంగణం
తళతళలాడే శే్వతవర్ణం
దాని ఆభరణం
విశ్వ నయనాలను
అక్కున చేర్చుకునే
ఓ దేవాలయం
మధుర భావ కుసుమాలతోనే
దాని తేజం
మల్లె వంటి మనసుతో
వెనె్నలోలే వెలుగులు పంచడం
దాని నైజం
అన్ని వాదాలను
కడుపులో దాచుకునే
ధవళ పత్రరాజం
కలం చేసే
నాట్య విన్యాసాలకు

04/03/2017 - 14:30

విష రసాయన ఱంపాల కోతలో
ఏళ్ల తరబడి గుక్కపట్టి ఏడ్చిన మట్టి
ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది
జీవామృతాన్ని జీర్ణించుకుని
వైనంగా గుల్లబారి గుంభనంగా నవ్వుతోంది
ఆరార అగ్న్యస్త్ర కషాయాన్ని ఆరగించి
ఆకుపచ్చ శస్త్రాలను ఆకాశంవైపు నిలబెడుతోంది
పునర్జీవం పొందిన వానపాములు
మట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాయి
శ్రద్ధగా బోధనలు వింటున్న శిష్యుల్లా

Pages