S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

02/12/2017 - 21:49

ఎండిన గొంతులు పొలాలు
కాలువలు నదులు
ఎదురుచూస్తుంటాయి
ప్రార్ధిస్తుంటాయి
కరుణించని వర్షాన్ని
కనికరం చూపమంటూ-
ఫ్యాక్టరీ ఆరంభానికి సైరన్ కూతలా
ఉరుము వురిమి
మేఘం ప్రసవించిన చినుకులు
వెండి దారాల్ని అల్లుకుంటూ
నేలకు నగ్నంగా జారుతాయి!
వర్షానికి వస్త్రాలుండవు
మనిషి కంటపడే లోగా
మట్టి గుడ్డల్ని చుట్టుకుని

02/12/2017 - 21:47

ఆకు రాలినా
ఆ చెట్టెన్నడు దుఃఖించదు
కొత్త అనుభవానికి
చిగురు కవాటాన్ని తెరుస్తది!

నేనంతే
ఎన్నిసార్లు గాయపడినా
కించిత్ ఖేదపడను
కొత్త అనుభూతిని ఒడిసిపడతా!

ప్రవహిస్తుంటేనే కదా
తగిలేది అడ్డంకులు
అధిగమించంది
నేను నదినెట్లవుతా?

శిఖరంమీద
నుంచున్న వానికి
నేలమీది మనుషులు
చీమల్లా అగుపిస్తరు!

02/12/2017 - 21:46

జ్ఞాపకాల మెట్లమీదికెళితే
ఆ మహాగాయం
కన్నీటి దొంతరను ఒరుసుకొంది కోసారి...
అంతర్ధానం కాని దృశ్యాల
పచ్చి ఇంకా ఆరనే లేదు
దిగుడుబావిలో ఏదో మూల
జీరగొంతుల సన్నని అరుపులు ఆగనే లేదు
ఉసురుతీయడమే తెలుసు గాయానికి
పువ్వెంత మెత్తగా ఉన్నా
కత్తికి కనికరముండాలి కదా!
లోయలకు దిగబడి కసిగా కోయడమే
గాయానికి తెలిసిన ఏకైక మహాకార్యం

02/12/2017 - 21:44

ఆధునికాంధ్ర కవిత్వంలో భావ కవితా యుగంలోనూ అంతకుపూర్వం సంఘ సంస్కరణ కవిత్వం, దేశభక్తి కవిత్వం ఆవిర్భవించిన సమయాల్లో రవీంద్రుని ప్రభావం బలంగా ఉంది.

02/12/2017 - 21:42

‘‘అవధాన ప్రతిభాసముద్రుడవు అన్నా! మాచిరాజాన్వయా!
శివరామాభిధ! రాజగౌరవనిభా! శ్రేష్ఠావధానీ! కవీ!
భవదీయాద్భుత సాహితీవిభవ సంభ్రాంతోరు గాధావళుల్
సవన ప్రజ్వలితాగ్ని కీలలయి ఆశాంతంబు పర్వెన్ జుమీ!’’

02/05/2017 - 22:15

నల్లదుప్పటి ముసుగు తీసి
ఎరుపు చూపుల కన్ను తెరచి
పరుచుకున్న పచ్చనేలపై
వేడి వెలుగులు విస్తరిస్తూ
పచ్చి పువ్వుల విచ్చదీస్తూ
నిదుర మొద్దుకు చురక పెడుతూ
అవని మీద అందాలను
ఒక్కటొక్కటిగా పలకరిస్తూ
జడ జీవులకు చైతన్యమిస్తూ
సాగిపోయే సొగసులయ్య
ఎవరిమెప్పునూ ఆశించడు
తన దిన చర్య తప్పడు
ఆ సూరీడు బాటలో నడుద్దాం

02/05/2017 - 22:15

అదో పెద్ద చెరువు
పట్నానికి తాగునీరందించే నీటి వనరు
చుట్టూ చెట్టూచేమా
సీజనల్‌గా ఎన్నారై పక్షులూనూ
పట్నం సిటీగా మారింది
గుడారంలో తల ఉంచిన ఒంటె, ముందు తన కాళ్ళనూ
నెమ్మదిగా శరీరాన్నీ, తదుపరి గుడారం
మొత్తాన్నీ ఆక్రమించి బేహారుని బయటికి నెట్టింది
చెరువు అంచుల చుట్టూ
కబ్జా ప్రహరీలూ, ఇళ్ళూనూ,
చెరువు ‘తమ’ని కబ్జాచెయ్యకుండా!!

02/05/2017 - 22:12

తెలియని ఆత్మ సంగతి ఎవరికి తెలుసు
తెలిసే శ్వాసకంటే
దగ్గరేముంటుంది శరీరానికి

ఆత్మన్నది ఉంటే
శరీరాల్ని ఆత్మ వెతుక్కుంటుందా
ఆత్మని శరీరమా
ఎవరికీ కనిపించకుండా
ఆత్మ శరీరంలోనే ఎందుకు దాక్కోవాలి
రహస్యంగా వచ్చి
తీరాలు అలలూ లేని
ఏ నిశ్శబ్ద సముద్రంలో
ఈ ఆత్మల నదులన్నీ కలుస్తాయో

02/05/2017 - 22:11

‘‘కుంభమేళా’’, ‘‘అస్తిత్వానికి అటూ ఇటూ....’’అనే రెండు కథా సంపుటాల ద్వారా పాఠకుల, విమర్శకుల ప్రశంసలనందుకున్న మధురాంతకం నరేంద్రను ఇవ్వాళ కొత్తగా మంచి రచయితగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథాకథనాలతో వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యభరితమైన కథలు రాయడం ఆయన ప్రత్యేకత. వీరి కథలు ఎక్కువగా అస్తిత్వవాద ధోరణిలో తాత్త్విక ధోరణిని సంతరించుకుని వుంటాయి.

02/05/2017 - 22:10

ఇది యవన రాజ్యం
వనల రాజ్యం
ఎవ్వరైనా ఇక్కడ యవ్వనులే
ఇక్కడి వినోదాలపై బ్రతుకుతోంది ప్రపంచమో సగం
ఇక్కడి వినోదంకోసం తన్నుకుఛస్తోంది ఇంకో సగం
ఇక్కడ చావుకూ వినోదానికి పెద్ద తేడా లేదు
ఆడుకోటానికి వాల్‌మార్టుల్లో
దొరుకుతాయ్ స్టెన్ గన్నులు
తెలుపు నలుపు కుర్రకారుకు
అవే అంతులేని ఫన్నులు
అసహనం, అహంకృతి కలిసి ఆడుకొంటుంటాయి

Pages