S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

08/17/2017 - 21:13

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో టీవీ షోలను అదేపనిగా వీక్షిస్తున్న యువత కాలాన్ని వృథా చేయడమే కాదు, అనేక శారీరక మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏకబిగిన టీవీ షోలను వీక్షిస్తున్న వారు నిద్రలేమి, అలసటకు లోనవుతున్నారని ల్యూవెన్ విశ్వవిద్యాలయం (బెల్జియం) పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు.

08/17/2017 - 21:12

చేతిలో పుస్తకం ఉన్నా లేకున్నా, నేటి కుర్రకారుకు సెల్‌ఫోనే అత్యంత ప్రధానం. అధునాతన స్మార్ట్ఫోన్లు వాడుతూ సామాజిక మీడియాలో కాలక్షేపం చేయడమే యువతలో చాలామందికి ముఖ్య వ్యాపకం అయింది. సెల్‌ఫోన్ ఎందుకు వాడుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే, అదే పనిగా గంటల తరబడి ఫోన్లను వాడేవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

08/17/2017 - 21:10

విదేశంలో సంపాదనకు లోటు లేదు.. విలాసవంతమైన జీవితం.. గంటల తరబడి చెమటోడ్చి పనిచేయాల్సిన అవసరం లేనే లేదు.. దేనికీ లోటు లేకున్నా మనసులో ఏదో అసంతృప్తి.. ఏదో సాధించాలన్న ఆరాటం.. సొంతగడ్డపై అంతులేని మమకారం.. అందుకే- ఎవరేం అనుకున్నా పట్టించుకోకూడదనుకుని మంచి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు.. సొంత ఊరికి చేరుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు..

08/17/2017 - 21:08

సాంకేతిక విద్యలో దేశంలోనే పేరెన్నికగన్న ఐఐటిల్లో ఇకపై అమ్మాయిల భాగస్వామ్యం గణనీయంగా పెరగనుంది. ఇప్పటి వరకూ ఐఐటి ప్రవేశాల్లో అబ్బాయిల ఆధిక్యం కొనసాగుతోంది. ఐఐటిల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతుల సంఖ్యను పెంచేందుకు ఇటీవల కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఓ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది.

08/10/2017 - 22:37

మొన్నటి వరకూ అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఎలాంటి దిశానిర్దేశం లేక కాలక్షేపం చేసిన కుర్రకారు ఇపుడు ‘్ఫట్‌బాల్’ క్రీడలోనే కాదు.. జీవితంలోనూ ‘గోల్’ సాధించాలని పరితపిస్తున్నారు. ‘గోల్’ కొట్టాలన్న ఆరాటమే కాదు.. అందుకు తగిన సాధన చేస్తూ అందరి చేత ‘్భష్’ అనిపించుకుంటున్నారు.

08/10/2017 - 22:36

సాంకేతికత ఎంతగా విజృంభిస్తోందో.. దాన్ని ఆధారంగా చేసుకొని నేరాలకు పాల్పడేవారి సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గ్రామసీమల్లో సైతం నగదు రహిత లావాదేవీలు పెరగడంతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువవుతోంది. కంప్యూటర్లలో మనం నిక్షిప్తం చేసుకొనే సమాచారానికి రానురానూ భద్రత కరవవుతోంది.

08/10/2017 - 22:33

వినోదం కోసమో, వికాసం కోసమో కాదు.. దేశ సరిహద్దుల్లో సైనికులకు ఉపయోగపడే అద్భుత రోబోను రూపొందించి ఓ ఇంటర్ కుర్రాడు అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిన ఒడిశాకు చెందిన నీల్మాధబ్ తలానగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ తన మేధస్సుకు పదును పెట్టి ఈ అద్భుతాన్ని సాధించాడు.

08/10/2017 - 22:30

పేరుకున్న చెత్తకుప్పలు, పాడైన రహదారులు, వెలగని వీధిదీపాలు, పనిచేయని నల్లాలు, పూడుకుపోయిన డ్రైనేజీ... ఇలాంటి సమస్యలతో అనునిత్యం ఇబ్బందిపడేవారిని చేతనైనంత మేర ఆదుకోవాలని ఆ విద్యార్థులు సంకల్పించారు. నగరాల్లో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు ఓ వినూత్న ‘యాప్’ను రూపొందించారు.

08/10/2017 - 22:26

చిన్నపిల్లాడేం కాదు.. అయినా వీడియోగేమ్‌లంటే విపరీతమైన మోజు.. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ కుర్రాడు వీడియోగేమ్ కొనివ్వలేదని తండ్రిపై అలిగాడు.. తండ్రి కోప్పడ్డాడని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ విషాద ఘటన - క్షణికావేశంలో జరిగే అనర్థాలకు నిదర్శనం..
***

08/03/2017 - 22:39

కఠినమైన రహదారుల్లో, భయం గొలిపే పర్వత ప్రాంతాల్లో సైతం ‘ఎదురే మాకు లేదు.. మమ్మెవరూ ఆపలేరు..’ అంటూ ఆ యువతులు బైకులపై జోరుగా సాగిపోతున్నారు. కేవలం కాలక్షేపానికో, మానసిక ఉల్లాసానికో కాదు.. సామాజిక చైతన్యం కోసం దేశ విదేశాల్లో వీరు బైక్ యాత్రలు చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రెండేళ్ల క్రితం పదిమంది మహిళలతో ప్రారంభమైన ‘బైకింగ్ క్వీన్స్’ క్లబ్ అంచెలంచెలుగా ఎదిగింది.

Pages