S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 08:24

మహబూబాబాద్, నవంబర్ 19: అంగన్‌వాడీ ఉద్యోగులు అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వర్తించాలని స్ర్తి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం పట్ల శ్రద్ధ చూపాలని మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఆదేశించారు. మానుకోట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం బాలల హక్కుల పరిరక్షణ, మహిళా శిశుసంరక్షణ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమంపై సిడిపివోలు, ఎసిడిపివోలు సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

11/20/2016 - 08:23

పాలకుర్తి, నవంబర్ 19: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు బిల్లులు చెల్లించవద్దని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి భూక్య దల్జిత్‌కౌర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

11/20/2016 - 08:23

నిజాంసాగర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని 200 కోట్ల చేప పిల్లల కోనుగోలు కోసం ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ గుల్‌గస్తు గార్డెన్‌లోమత్స్య కారులనుద్దేశించా మాట్లాడారు.

11/20/2016 - 08:22

నిజామాబాద్, నవంబర్ 19: అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయోత్పత్తుల అమ్మకాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మధ్య దళారులు, వ్యాపారులు కూడబలుక్కుని మార్కెట్‌ను శాసిస్తూ ధరల మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రైతుల వద్ద పంట ఉత్పత్తులు ఉన్న సమయంలో అరకొర స్థాయిలో ధర అందిస్తుండగా, అది కాస్తా వ్యాపారుల చేతికి చేరగానే రెక్కలొచ్చి అమాంతంగా ధరలు పెరుగుతున్నాయి.

11/20/2016 - 08:19

మెదక్, నవంబర్ 19: నిష్పక్షపాతంగా, న్యాయపరంగా విధులు నిర్వహించాలని మెదక్ నిజామాబాద్ జిల్లాల డిఐజి అకున్ సబర్వాల్ ఆదేశించారు. శనివారం మెదక్ పోలీస్ సబ్ డివిజన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమ్యూనిటీ పోలిసింగ్ పెంపొందించాలని, క్రైం రేటును తగ్గించాలని, ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులన్నింటిని విచారించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని డిఐజి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

11/20/2016 - 08:19

నల్లగొండ, నవంబర్ 19: మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు అరకొర వసతులకు నెలవుగా మారగా పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పక్కా భవనాల మంజూరైనా నిర్మాణాలు పూర్తి చేయించడంలో తీవ్ర జాప్యం సాగిస్తుంది. గర్బిణిలు, చిన్నారులు, బాలింతల సంక్షేమ పథకాల పోషకాహార పథకాలను అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందినే పర్యవేక్షిస్తున్నారు.

11/20/2016 - 08:16

మహబూబ్‌నగర్, నవంబర్ 19: బాలల హక్కుల సంరక్షణలో భాగంగా 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలను పని చేయించడం, బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా లిగల్ సర్విసెస్ అథారిటీ పని చేస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ప్రెండ్లీ లిగల్ సర్విసెస్ ప్రొటెన్షన్ స్కీం 2015 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

11/20/2016 - 08:15

కరీంనగర్, నవంబర్ 19: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడె ట్ ట్రైనీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టిఎస్‌ఎస్పీ/ఎస్పీఎఫ్/ ఎస్‌ఏఆర్‌సిపిఎల్/ఎస్‌ఎఫ్‌ఓ) అభ్యర్థుల ఎం పిక ప్రక్రియలో భాగంగా రెండు రోజులుగా జరగనున్న రాతపరీక్షలు శనివార ం ప్రారంభమయ్యాయి. మొత్తం 12,3 05 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 11,935 మంది హాజరై పరీక్ష రాసారు. 370మంది గైర్హాజరయ్యారు.

11/20/2016 - 07:59

ఏలూరు, నవంబర్ 19: తుప్పుపట్టిన తుపాకులిచ్చి యుద్ధంలో గెలవమంటే ఎలా?... ఆ తుపాకులతో కాల్చితే ఆ బుల్లెట్‌లు తిరిగి మనకే తగులుతాయని, రెండున్నర ఏళ్ల నుండి డెల్టా ఆధునీకరణ పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజనీరింగ్ వ్యవస్ధ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తుంటే ఇక యుద్ధంలో ఎలా గెలుస్తామని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ప్రశ్నించారు.

11/20/2016 - 07:57

మంచిర్యాల అర్బన్, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పెట్టింది పేరని, అలాంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం సిగ్గు చేటని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి అన్నారు. లోక్‌సభలో గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఐబి చౌరస్తాలో గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

Pages