S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 23:28

సానియామిర్జా వలిమా డిన్నర్ సందర్భంగా భర్త, ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ తన ఇంటిని విద్యుదీకరణ చేసుకుంటానంటే, విద్యుత్ పొదుపు వారోత్సవాల్ని జరుపుతున్న సందర్భమని అనుమతి నిరాకరించింది ఆ ప్రభుత్వం. మన దేశంలో ఇలాంటివి వింతగా తోస్తాయి. పైగా ప్రజావసరాలకై వినియోగించే విద్యుత్‌ను, కోత వున్నా ఇలాంటి దుబారా వినియోగానికి వెనుకంజ వేయవు మన ప్రభుత్వాలు.

11/20/2016 - 23:20

సర్వగ భావంలో కందువ
కలల కళ్ళు విప్పి
నిర్భగ్న నిశ్చలత్వంతో లోకాలోకానం చేస్తున్న
దృశ్యమే తోచింది
ఉదయారుణ వలయాన్ని నెత్తిన పెట్టుకున్న ఉర్వీధరానికి
చెట్టుపూల చూపుల భాష్యం వివరిస్తున్నట్లుంది
అవ్యక్త మధుర ధ్వని సమాస పరిమళం
అంతటా అలముకొంది
పక్షి పాడుతున్న పాటలో రూపాంతరం చెందుతున్న
వత్సనగ్న వాఙ్మయమంతా వర్ణ విభ్రాజితమే...

11/20/2016 - 23:19

పెదవి దాటని మాట
వౌనంగానే పల్కరించి
చూపులతో మాట్లాడింది
యుగయుగాంతరాల భావమొకటి
వాయు తరంగాలలోంచి
అంతరంగాన్ని కల్లోలపరిచింది
విలువైన ద్రవ్యరాశి
చెల్లని నాణేల మోతకు
నిలువ నీడలా నిలుచుని
మూగవోయంది!
సుఖ లాలసలో
మన్ను మిన్ను మరచిన
నగరానికి పల్లె మూలల
వ్యథలు - గాథలు రుచించలేదు
రసరాజ్యమంతా
తమదేననుకొనే భావుకులు

11/20/2016 - 22:04

‘విశ్వశ్రేయః కావ్యమ్’ అని చాటిన కవి సంస్కృత కవి కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు జనుల కవి నన్నయ. కవులు ఏ ప్రాంతానికి చెందినా వారి కావ్యాలూ కవిత్వాలూ విశ్వజనీనంగానే ఉంటుంటాయి. చాలామట్టుకు పవిత్ర గోదావరీ జలాలను తనలో కలుపుకున్న అందాల కృష్ణమ్మ కనుసన్నలలో చలచల్లని గాలుల వీవనల చెంగిట 2016 నవంబరు 13, 14 తేదీలలో అంతర్జాతీయ అనేక భాషా కవి సమ్మేళనం జరిగింది.

11/20/2016 - 22:00

కల్పన సాహిత్యం సన్నగిలిపోయి, కథ అనేది మరుగు అయిపోతుందేమో అనే భయాన్ని మనసులో నింపుకుని కొందరు, ఈ ప్రక్రియకు ‘మ్యాజిక్ రియలిజమ్’ అనే కొత్త సంవిధానాన్ని మొదట్లో ఆ పేరు తెలియకుండానే ఆశ్రయించారు. సాంఘిక వాస్తవికత కూడా పాతబడిపోతున్న రోజులలో ఈ మ్యాజిక్ రియలిజమ్ ఉధృతం అయిపోయింది.

11/20/2016 - 21:57

తమ్ముడూ! హృదయం లేనివాడెవడీ లోకంలో
వెచ్చటి కాంతి కిరణం సోకక
మెత్తటి స్నేహ చర్య దొరకక
పల్చటి తడి దారి కలవక
ఒక గడ్డ కట్టిన మంచు జడత్వంతోనో
చీకటి కాటుకలో వెలగని దీపంగానో
ఎండిన వాగులోకి విసరబడ్డ కంకర రాయగానో
మిగిలిపోతాం
తమ్ముడూ! శాశ్వతంగా ఏదుంటుందీ లోకంలో
కళ్ళముందే కొండలు కరిగిపోతున్నాయ
కాలచక్రపుటుండలూ తరిగిపోతున్నాయ

11/20/2016 - 21:56

కాళోజీ నారాయణరావు నిజాం ప్రాంత సామాజిక చరిత్రకు, సాహిత్య చరిత్రకు ఒక ప్రతీక, ప్రతినిధి. అచ్చ తెలంగాణ భాషను స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా మాట్లాడటం, ఆ భాషలో కవిత్వం, కథలు, వ్యాసాలు రాయడంలో సిద్ధహస్తుడు.

11/20/2016 - 21:47

‘ప్రజలకు ఉపకారం చేయాలి’అనే నియమాన్ని నిత్యవ్రతంగా ఆచరించటమే ‘లోకోపకార వ్రతం’ కృత, త్రేత, ద్వాపరయుగాల నుండీ భరత వర్షంలో ఎందరో మహర్షులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు, పండితులు, వేదవిదులు ప్రజలకోసం ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభకార్యాలు లోకోపకారంకోసం నిర్వహించారు.

11/20/2016 - 21:45

‘నాకు ఆత్మసాక్షాత్కారం అయింది’, ‘నేను బ్రహ్మమును తెలిసికొన్నాను’ అని ఎవరైనా చెబితే అట్టి వ్యక్తి ఆత్మను ఇంకా తెలిసికోలేదనే అర్థం. ఎందుకంటే ఆత్మను తెలిసికొన్న నేను వేఱు అనీ, తెలియబడిన వస్తువుగా ఆత్మవేఱు అనీ ఏర్పడుతుంది.

11/20/2016 - 21:43

భవరోగహరుడైన శివుడు దైహిక, దైవిక, భౌతిక తాపాలను దరిచేరనీయడు. పరమ శాంతిదాయకమైన శివలోకప్రాప్తిని కలిగించేవాడు. రోగశోక బాధలను నశింపచేసేవాడు. అటువంటి వైద్యనాథేశ్వరుని దర్శన భాగ్యంతో సమస్త పాపాలూ నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

Pages