S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 23:40

నేరేడుచర్ల, నవంబర్ 20: ప్రభుత్వం మార్చి 31వరకు సాగర్ నీరు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుందని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

11/20/2016 - 23:39

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిందు..తుంపర సేద్యం సాగును ప్రోత్సాహిస్తామన్న ప్రకటనకు అనుగుణంగా నిధుల విడుదల చేయకపోవడంతో మండలాల్లో సూక్ష్మ నీటిపారుదల పథకం పరికరాల మంజూరుకు రైతులు రెండేళ్లుగా ఎదురుచూపులు పడుతున్నారు. అసలే కరవు పీడిత, వర్షాభావ ప్రాంతమైన నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల రైతాంగం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంది.

11/20/2016 - 23:39

నాంపల్లి, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి నుండి మొదలు చేసిన రైతుపోరుయాత్రను విజయవంతం చేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి అన్నారు. ఆదివారం స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టిడిపి రైతులను చైతన్యపరిచేందుకు రైతుపోరుయాత్రను తలపెట్టిందని, ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.

11/20/2016 - 23:38

దేవరకొండ, నవంబర్ 20: సహకారబ్యాంక్‌ల్లో కూడా వేయి, ఐదువందల నోట్ల మార్పిడికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని సిపి ఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్ధానిక ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/20/2016 - 23:38

భువనగిరి, నవంబర్ 20: కార్తీకమాసం పురస్కరించుకుని ప్రణవ సంస్థ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో భువనగిరిలో నిర్వహిస్తున్న మహ విజయచండీ హోమంలో ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు. ఆదివారం హోమం ముగింపు కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలోరోశయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

11/20/2016 - 23:37

కేతెపల్లి, నవంబర్ 20: అత్తింటి వేధింపులు, భర్త చిత్రహింసలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన మండలంలోని ఇనుపాముల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తండు కళ్యాణి(23)ని మిర్యాలగూడ పట్టణానికి చెందిన గుణగంటి ప్రమీళ మల్లయ్య కుమారుడు అయిన వేణుతో సంవత్సరం క్రితం వివాహం చేశారు.

11/20/2016 - 23:36

వివాదాలను పరిష్కరించవలసిన వ్యవస్థ వివాదగ్రస్తం కావడం విచిత్రమైన పరిణామం. వివాదం అంకురించడానికి కారణం ఎవరు? ప్రాతిపదిక ఏమిటి? అన్న సందేహాలకు సరైన సమాధానం దొరకకపోవడం మరో విచిత్రం.

11/20/2016 - 23:35

ముస్లిం సమాజపు అంతర్గత సమస్యగా చెప్పబడుతున్న ‘తలాక్’ అంశం రద్దుపైన విస్తృత చర్చ అవసరం. మానవత్వ కోణంలో చూస్తే స్ర్తి స్వేచ్ఛకు ‘తలాక్’అనేది భంగకరం. మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా మత ఆచారాలు, గ్రంథాలలో వ్యాఖ్యానాలు కూడా మార్చుకోవలసిన అవసరం ఉంది. ముస్లిం మత పెద్దలు, మేధావులు, సామాజికవేత్తలు తలాక్ అంశాన్ని సమీక్షించాలి.

11/20/2016 - 23:34

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అన్నట్లు- ‘‘దాన్నంతటినీ నల్లధనం అనకండి. లెక్కలోకి రాని కష్టార్జితమే అదంతా’’. దేశంలో యివాళ విచిత్రమైన పద్ధతి నెలకొని వుంది.

11/20/2016 - 23:30

ప్రభుత్వాల ద్వంద్వ వైఖరులను అర్ధం చేసుకొని అర్ధమేధావులు, మూర్ఖ మేధావులు, అసలు ఎలాంటి మేధస్సు లేని మేతావులు ఇవ్వవలసిన వారికి సలహాలు ఇవ్వడంలో మిన్నకుండి కేవలం ఉపాధ్యయులకు సలహాలిస్తున్నారు. తాము పనిచేసే గ్రామాలలోనే వారు నివాసముండేలా చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు అందుబాటులో ఉంటే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందనేది ఉవాచ.

Pages