S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 21:02

బాలీవుడ్‌లో వచ్చిన సంచలన సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. ఈ సినిమా మొదటి భాగం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాలతో దుమ్ములేపిన సంజయ్‌దత్.. ఇప్పుడు మూడో మున్నాభాయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మున్నాభాయ్ చలే అమెరికా’ అంటూ అప్పట్లోనే చిన్న టీజర్ కూడా వదిలారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్‌చోప్రా నిర్మించే ఈ మూడో సీక్వెల్ ఫైనల్ అయిందట.

11/20/2016 - 21:01

అందాల భామ త్రిష... ఈమధ్య సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి కానె్సప్టు ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ‘మోహిని’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ సాధురంగా వెట్టై సినిమాలో నటిస్తుంది. ఇక లేటెస్ట్‌గా త్రిషకు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఇదేమిటో తెలుసా. పవన్‌కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట!! ఇప్పటికే ఈ అమ్మడు ‘తీన్మార్’ సినిమాలో పవన్‌తో కలిసి నటించింది..

11/20/2016 - 20:59

శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ ప్రధాన తారాగణంగా శివరాజ్ కనుమూరి రూపొందించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను ఎఫ్‌ఎం రేడియోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ.. కార్తీక్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని తెలిపారు.

11/20/2016 - 20:57

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరుచెబితే ఎవరికీ తెలియదు. కానీ హీరో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తుపడతారు. స్టార్ హీరో శరత్‌కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్‌గానే పాపులర్ అయింది. ఈమధ్య విశాల్, వరలక్ష్మిల మధ్య ఎందుకు చెడిందో తెలియదు కానీ ఇద్దరిమధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్‌గా వరలక్ష్మి..

11/20/2016 - 20:55

ఒక సినిమాలో ఒక లిప్‌లాక్ సీన్ ఉండడం అనేది ఎంత క్రేజో అందరికి తెలుసు. ఆ సినిమాలో ఆ ముద్దు సన్నివేశం ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసే ఆడియెన్స్ ఉంటారు. ఇక ఈమధ్య ప్రతి సినిమాలో ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో ఈ ఘాటు లిప్‌లాక్‌లకు కొదవే లేకుండా పోయింది. జనరల్‌గా ఒక్క లిప్‌లాక్ ఉంటేనే అంత క్రేజ్ ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 40 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయట!!

11/20/2016 - 19:14

శ్రీకాళహస్తి, నవంబర్ 19: శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు బాబు గురుకుల్(78) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చెన్నయ్‌లో ఆసుపత్రికి ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

11/20/2016 - 08:27

ఎల్కతుర్తి/ హుజురాబాద్, నవంబర్ 19: ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్‌లోని కాకతీయ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గూడ కరుణాకర్‌రెడ్డి (44) అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ నుండి హన్మకొండ వైపు కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది.

11/20/2016 - 08:26

లింగాలఘణపురం, నవంబర్ 19: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం శనివారం ఆలయ ఆవరణలో వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో 58మంది దంపతులతో పాటు 35మంది శాశ్వత విరాళ దంపతులు కూర్చున్నారు.

11/20/2016 - 08:26

లింగాలఘణపురం, నవంబర్ 19: సుప్రసిద్ధ క్షేత్రమైన జీడికల్ శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం ఎంతో విశిష్ఠత కలిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. శనివారం సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతాలు వేరైన దేవుడు ఒక్కడేనని ఆయన అన్నారు.

11/20/2016 - 08:25

వరంగల్ (కల్చరల్) నవంబర్ 19: కాజీపేటలో కొలువుదీరిన స్వయంభూ శ్రీశే్వతార్కమూలగణపతి దేవాలయ క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులచే పాలను సేకరించిన 108లీటర్ల పాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Pages