S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐఆర్‌ఎఫ్ కార్యాలయాల్లో ఎన్‌ఐఎ సోదాలు

న్యూఢిల్లీ, నవంబర్ 19: ముంబయిలోని నిషిద్ధ స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)కు సంబంధించిన పది కార్యాలయాలపై శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహించింది. ఐఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్ తదితరులపై శుక్రవారం రాత్రి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదయిన నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఎ ఈ సోదాలు నిర్వహించింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153-ఎ (మత ప్రాతిపదికపై భిన్న సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, సామరస్యాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు పాల్పడటం)తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ)లోని పలు సెక్షన్ల కింద నాయక్ తదితరులపై ఎన్‌ఐఎ ముంబయి బ్రాంచ్ కేసు నమోదు చేసింది.
కేంద్ర క్యాబినెట్ కొద్ది రోజుల క్రితం యుఎపిఎ కింద ఐఆర్‌ఎఫ్‌ను నిషిద్ధ సంస్థగా ప్రకటించడంతో ఎన్‌ఐఎ ఆ సంస్థపై చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక కేఫ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకతను తాము నాయక్ ఉపన్యాసాల నుంచి ప్రేరణ పొందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్న తరువాత వివిధ భద్రతా సంస్థలు ఐఆర్‌ఎఫ్ కార్యకలాపాలపై నిఘా పెట్టాయి. ఈ సంవత్సరం మొదట్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరడానికి ఇళ్లనుంచి వెళ్లిపోయిన ముంబయి శివార్లకు చెందిన కొంత మంది యువకులు కూడా నాయక్ ఉపన్యాసాల నుంచి ప్రేరణ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం నాయక్ భారత్‌లో లేడు. అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు అతను విదేశాలకు వెళ్లినట్లు భావిస్తున్నారు. నాయక్ ఉపన్యాసాలను బ్రిటన్, కెనడా, మలేసియాలో నిషేధించారు. అంతర్జాతీయ ఇస్లామిక్ చానల్ అయిన పీస్ టివితో ఐఆర్‌ఎఫ్‌కు అనుమానాస్పద సంబంధాలు ఉన్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కనుగొంది. నాయక్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు ఉగ్రవాద ప్రచారానికి పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.