S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వణికిస్తున్న చలి పులి

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చాలా జిల్లాల్లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. చాలా జిల్లాల్లో గత రాత్రి కనీస ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలో కనీస ఉష్టోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో 13 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం,
నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సోమవారం విపరీతమైన చలి ఉంటుందని ఐఎండి ప్రకటించింది. డిసెంబర్ వరకు ఇది మరింతపడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. చలి ఎక్కువగా ఉండటం వల్ల శ్వాసకోస, ఉబ్బసం తదితర వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు చల్లగాలిలో తిరగరాదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.