S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామాజిక రుగ్మతలను రూపుమాపుతాం

హైదరాబాద్, నవంబర్ 18: బాలలకు ఆలనా పాలనా లేకుండా వారి భవిష్యత్ అంధకారంలో ఉంటే సమాజం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పాపమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సమాజాన్ని నేడు అనేక రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయని, వాటిని రూపుమాపేందుకు విద్యా సంస్థలు, పరిశోధక సంస్థలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడామిస్ర్తి కాలేజీ ఆఫ్ సోషల్ వర్కు, రీసెర్చి సెంటర్ స్వర్ణోత్సవ వేడుకలకు కడియం శ్రీహరి శుక్రవారం హాజరయ్యారు. దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా ఇంకా బాల కార్మికులు, వీధి బాలలు, దివ్యాంగులకు సమాజంలో మెరుగైన స్థానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 67 వేల మంది దివ్యాంగులున్నారని, వారిలో చాలా మంది పాఠశాలలకు వెళ్లే స్థితిలో లేరని పేర్కొన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అనేక మంది బాలలు జిహెచ్‌ఎంసి పరిధిలో వీధి బాలలుగా ఉంటున్నారని, వీరిలో చాలా మందిని జిహెచ్‌ఎంసి పునరావాస కేంద్రాలకు తరలిస్తోందని, అయినా ఇంకా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బాల కార్మికులు లేరని కొంత మందిచెబుతున్నప్పటికీ మహబూబ్‌నగర్‌లోని పత్తి పొలాల్లో బాలలు ఇంకా పనిచేస్తునే ఉన్నారని అన్నారు. బాల కార్మికులు లేరని చెప్పడం ఆత్మవంచనే అవుతుందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సామాజిక సంస్థలు సూచిస్తే వాటిని అమలుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు రాష్ట్రంలోని సంస్థలు ప్రాజెక్టుల కోసం ఎక్కడో వెతుక్కోవలసిన పనిలేదని ప్రభుత్వం వద్దనే చాలా ప్రాజెక్టులున్నాయని, కలిసి వస్తే ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
విద్యార్థులకు పాఠాలు
ఇదిలావుంటే, హయత్‌నగర్‌లో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేయడానికి వచ్చిన కడియం శ్రీహరి, స్టడీ అవర్స్‌లో జూనియర్ ఇంటర్ విద్యార్థులకు పాఠాలు ఎలా చెబుతున్నారో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్స్‌ను కూడా పరీక్షించారు. అనంతరం ఆయన కొద్దిసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు.

చిత్రం.. రోడామిస్ర్తి కాలేజీ ఆఫ్ సోషల్ వర్కు, రీసెర్చి సెంటర్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని సావనీర్‌ను విడుదల చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి