S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 00:15

భీమవరం, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దగా చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. దేశంలో 25 శాతం నకిలీ నోట్లు చలామణీలో ఉంటే ఆ ప్రభుత్వం చూస్తూ ఉందన్నారు. 75 ఏళ్లలో ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారన్నారు. ఇప్పుడు దేశానికి మోదీ దేశానికి ఐకాన్‌గా మారారన్నారు.

11/19/2016 - 00:14

భీమవరం, నవంబర్ 18: ఆధ్యాత్మిక కేంద్రం, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న చంద్రపుష్కరిణి వద్ద శుక్రవారం రాత్రి గంగాహారితి నిర్వహించారు. గంగాహారతిలో భాగంగ స్పటిక లింగాన్ని కూడ ఏర్పాటుచేశారు. ఈ గంగాహారతికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిధిగా హారజయ్యారు. ముందుగా స్వామి వారికి ఎమ్మెల్యే పూజలు చేశారు.

11/19/2016 - 00:14

ఏలూరు, నవంబర్ 18 : ప్రజలు పురుగులా? మీరే మనుషులా? ఏమిటి ఈ నిర్లక్ష్య వైఖరి, ఎన్నాళ్లిలా సాగుతుంది? అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పంచాయితీ అధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఇవో పి ఆర్‌డిల సమావేశంలో పంచాయితీ పన్నుల వసూలు తీరు, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు.

11/19/2016 - 00:13

భీమవరం, నవంబర్ 18: 2014 ఎన్నికలకు ముందు జిల్లాలోని పాదయాత్ర చేస్తున్న సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ హామీలను మర్చిపోయారని జిల్లా కాపునాడు అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు అన్నారు. అసలు సీఎంకు చిత్తశుద్ధిలేదన్నారు. ఇచ్చిన హామీలను మరిచిపోతున్న చంద్రన్న భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని వెంకట్రాయుడు తెలిపారు.

11/19/2016 - 00:13

ఏలూరు, నవంబర్ 18 : జిల్లాలో చిల్లర నగదు సమస్యను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని, ఈ దిశగా వ్యాపారస్తులు ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటుచేసుకునేలా సర్వే పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు.

11/19/2016 - 00:12

దేవరపల్లి, నవంబర్ 18: కాపులంతా ఐక్యంగా ఉంటే సిఎం పీఠం కాపు నాయకులకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా కుమారుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. దేవరపల్లి మండలం యాదవోలులో శుక్రవారం రంగా, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలను ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

11/19/2016 - 00:12

ఏలూరు, నవంబర్ 18 : డ్రైన్లలో పూడిక తీయాలన్నా, రోడ్డులో గతుకులను సరిచేయాలన్నా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలన్నా ఆధునిక యంత్రాలు అందుబాటులోనికి వచ్చాయని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు తూర్పులాకుల వద్ద కొమడవోలు గ్రామ పంచాయితీలో ఈ యంత్రంను శుక్రవారం బడేటి బుజ్జి స్వయంగా నడిపి ప్రారంభించారు.

11/19/2016 - 00:10

రాజమహేంద్రవరం, నవంబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈనెల 26న జరగనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రైతు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేపట్టాయి. భారీస్థాయిలో జన సమీకరణకు కసరత్తు జరుగుతోంది. అమిత్ షా మీటింగ్ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం నగర బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.

11/19/2016 - 00:10

రాజమహేంద్రవరం, నవంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటన నేపథ్యంలో అనేక పెండింగ్ సమస్యలకు మోక్షం లభించగలదని ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం తొమ్మిదిర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వారం రోజులుగా నేతలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

11/19/2016 - 00:09

రాజమహేంద్రవరం, నవంబర్ 18: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు నిజంగా కాపు జాతి పట్ల చిత్తశుద్ధి, గౌరవం ఉంటే మంజునాథ కమిషన్‌ను కలిసేవారని, సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకునేవారని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages