S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 00:08

ప్రత్తిపాడు, నవంబర్ 18: కాపులను బిసిల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. సిఎం ఇచ్చిన హామీ అమలు కోసం రోడ్డెక్కితే సమస్యను పక్కదారి పట్టించే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునుద్దేశించి ప్రశ్నలు సంధిస్తూ శుక్రవారం సాయంత్రం ముద్రగడ లేఖ విడుదల చేశారు.

11/19/2016 - 00:08

కాకినాడ, నవంబర్ 18: తొండంగి కోన ప్రాంతంలో నిర్మిస్తున్న దివీస్ కాలుష్య పరిశ్రమతో ఆక్వా రంగం నాశనమవుతుందని వైకాపా నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో జిల్లాకు చెందిన వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు ఈ నెల 22వ తేదీన వైకాపా అధినేత జగన్ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు.

11/19/2016 - 00:07

రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని బిజెపిలో వర్గపోరు భగ్గుమంది. ఇంతకాలం గుంభనంగా ఉన్న వైరివర్గాలు రచ్చకెక్కాయి. నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సాక్షిగా బాహాబాహీకి దిగారు. రాజమహేంద్రవరంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం త్వరలో తాడేపల్లిగూడెంలో జరగనున్న అమిత్‌షా రైతు సభకు సంబంధించి సమీకరణపై నగర బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.

11/19/2016 - 00:07

అమలాపురం, నవంబర్ 18: ప్రధాని నరేంద్రమోదీ అవగాహనా రాహిత్యంతో, ఆయన పార్టీకి కొమ్ముకాసే వారికోసమే పెద్ట నోట్లు రద్దుచేశారని పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. శుక్రవారం అమలాపురంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నల్లధనం పేరుతో పెద్ద నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

11/19/2016 - 00:06

రావులపాలెం, నవంబర్ 18: కాపు ఉద్యమనేత ముద్రగడ కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో రావులపాలెంలో మోహరించిన బలగాలను శుక్రవారం కొంతమేర ఉపసంహరించారు. నాలుగో వంతు బలగాలను రాజమహేంద్రవరానికి తరలించినప్పటికీ స్థానిక కళా వెంకట్రావు సెంటరు, ఈతకోట, గోపాలపురం సెంటర్లలో రాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఎపిఎస్పీ తదితర అదనపు బలగాలు పహారా కాసాయి.

11/19/2016 - 00:04

భద్రాచలం టౌన్, నవంబర్ 18: భద్రాచలంలో వచ్చే ఏడాది జనవరి 8,9 తేదీల్లో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల వైభవోపేతంగా నిర్వహించాలని, నిర్వహణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై శుక్రవారం ముందస్తు సమావేశం నిర్వహించారు.

11/19/2016 - 00:04

ఖమ్మం, నవంబర్ 18: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, జిల్లాలో 2.70లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.95 లక్షల మరుగుదొడ్లను పూర్తిచేశామని, ఇంకా మిగిలి ఉన్న 76వేల వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార

11/19/2016 - 00:03

ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 18: నల్లకుబేరుల మొండిబకాయిలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించి స్థానిక బైపాస్‌రోడ్డులో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

11/19/2016 - 00:02

ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 18: జిల్లాలో బిజెపి అభ్యున్నతికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలతో ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడుతానన్నారు.

11/19/2016 - 00:02

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 18: బ్యాంకులను మోసం చేసిన కార్పొరేట్లకు రుణమాఫి చేయటం దారుణమని ఎల్‌హెచ్‌పిఎస్ జిల్లా కన్వీనర్ బాణోత్ భద్రునాయక్ అన్నారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దాచుకున్న సొమ్మును కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన బ్యాంకులు తిరిగి సొమ్మును స్వాధీనం చేయకుండా నిరర్ధక సొమ్ముగా ప్రకటించటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.

Pages