S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజలు పురుగులా.. మీరే మనుషులా?

ఏలూరు, నవంబర్ 18 : ప్రజలు పురుగులా? మీరే మనుషులా? ఏమిటి ఈ నిర్లక్ష్య వైఖరి, ఎన్నాళ్లిలా సాగుతుంది? అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పంచాయితీ అధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఇవో పి ఆర్‌డిల సమావేశంలో పంచాయితీ పన్నుల వసూలు తీరు, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు. కొంతమంది అధికారులు తమకు ఫ్యామిలీ బాధలున్నాయని చెబుతున్నారని, కానీ ప్రజల బాధలు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. పల్లెల్లో ఒక్క రోజు రాత్రి పూట కరెంటు లేకపోతే ప్రజలు పడే బాధలు వర్ణనాతీతమని కొంతమంది చీకట్లో దారి తెలియక గోతుల్లో పడి కాళ్లుచేతులు విరిగిపోతుంటే మరికింతమంది పాముకాటుకు గురై ప్రాణాలే పోయే స్థితిలో వుంటుందని వారంతా ఎందుకు బాధపడాలని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో 2014-15, 2015-16 ఆర్ధిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు బకాయిల గురించి ఇంకా సమీక్షిస్తున్నామంటే మనం ఎక్కడ ఉన్నామో అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. ఏదైనా పని చెబితే ఆ పని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి చలామణి అవుతోందని, అదే ప్రైవేటు రంగంలో అయితే ఇలా చేస్తే ఉద్యోగం ఉంటుందా? అని కలెక్టర్ ప్రశ్నించారు. పల్లెల్లో ప్రజల మధ్య ఉండాల్సిన అధికారులు పట్టణాలలో హాయిగా ఆనందంగా అపార్టుమెంట్లలో ఉంటున్నారని కానీ పల్లె ప్రాంత ప్రజల సమస్యలు మీరు పట్టించుకోరా? వాళ్లు పురుగులా? మీరే మనుష్యులా? ఏమిటీ ఈ వివక్షత అంటూ కలెక్టర్ గ్రామ పంచాయితీ కార్యదర్శులు మొదలు జిల్లా పంచాయితీ అధికారి వరకూ సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను తీసుకుని పన్నుల బకాయిల కింద జమ చేసుకోవాలని, ఇది ఒక సువర్ణావకాశమని కానీ జిల్లాలో 75 కోట్ల రూపాయలు పంచాయితీల నుండి పన్ను బకాయిలుంటే గత ఏడు రోజుల్లో కేవలం 1.85 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసారంటే సిగ్గుగా వుందని ఇంతకన్నా నిర్లక్ష్యం మరొకటి ఉండదని చెప్పారు. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి పన్నులు కట్టాలని ప్రజలకు ఇంకా డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వకపోవడం దారుణమని 2017 మార్చి లోగా ఈ పన్నులన్నీ వసూలు చేయాల్సి ఉందని కానీ నవంబరులో కూడా ఏ ఇంటికీ ఎంత పన్ను వసూలు చేస్తామో ప్రజలకు నోటీసు ఇవ్వకపోతే ప్రజలు కలలో తెలుసుకుని వచ్చి పన్నులు కడతారా? ఇంత బాధ్యతారాహిత్యమైన విధానాన్ని ఎక్కడా చూడలేదని ఇప్పటికైనా అందరి మనస్సుల్లో మార్పు రావాలన్నారు. తనకు ఎవరిపై ధ్వేషం లేదని ఈ వ్యవస్థ బాగుపడాలంటే అందరం కష్టపడి పనిచేయక తప్పదని హితవు పలికారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పరారీలో వున్న దెందులూరు ఇవో పి ఆర్‌డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని బాధ్యతారాహిత్యాన్ని సహించబోనని, కాశీ మజిలీ కధలు చెప్పడం మాని పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లాలో గత నెలలో పంచాయితీ కార్యదర్శుల్లో పని సంస్కృతిని పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రతీరోజూ తెల్లవారుఝామున 5.30 గంటలకే తాను వివిద పంచాయితీ కార్యదర్శులకు నేరుగా ఫోన్ చేసి గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రశ్నించానని, పది రోజులుపాటు అన్ని గ్రామాలలో సవ్యంగా పనులు జరిగాయని, ఈ విధానానే్న కొనసాగిస్తారని భావించానని, కానీ తర్వాత నుండి మళ్లీ పల్లెల్లో తెల్లవారుఝామున ఒక్కరు కూడా బయోమోట్రిక్ హాజరు వేయడం లేదని, రేపటి నుండి అన్ని గ్రామాలలో బయోమెట్రిక్ హాజరు తీరును స్వయంగా పరిశీలిస్తానని పంచాయితీ కార్యదర్శులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటానని చెప్పారు. సమావేశంలో డిపివో సుధాకర్, డి ఎల్‌పివోలు రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.