S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 00:01

వైరా, నవంబర్ 18:ది జిల్లా కేంద్రసహకార బ్యాంకులపై కేంద్రప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిసిసిబిల పాలకమండళ్ళు, బ్యాంకు సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈసందర్భంగా కేంద్ర వైఖరికి నిరసనగా బ్యాంకు సిబ్బంది, పాలకమండళ్ళు ధర్నా నిర్వహించారు. జరిగిన ధర్నాను ఉద్ధేశించి సొసైటీ అధ్యక్షుడు తాతా రంగారావు మాట్లాడుతూ డిసిసిబిలలో నోట్ల మార్పిడి అనుమతించాలని అన్నారు.

11/19/2016 - 00:00

జూలూరుపాడు, నవంబర్ 18: వ్యవసాయ రంగాన్ని పరిరక్షిస్తేనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మా అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార పోస్టర్లను శుక్రవారం ఆయన విడుదల చేశారు.

11/18/2016 - 23:59

గుంటూరు, నవంబర్ 18: జిల్లాలో రెడ్‌క్రాస్ ద్వారా ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు కలెక్టర్ కాంతిలాల్ దండే రెడ్‌క్రాస్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ సర్వసభ్య సమావేశానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు.

11/18/2016 - 23:58

గుంటూరు, నవంబర్ 18: జిల్లాలో అక్రమ మైనింగ్ యథేచ్చగా సాగుతోంది.. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు జరుపుతూ కొండలను కొల్లగొడుతున్నారు..ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో అనధికారిక క్వారీయింగ్‌కు అడ్డు అదుపులేకుండా పోయింది. దాచేపల్లి మండలంలోని ఒక్కో గ్రామంలో రోజుకు 8 లక్షల చొప్పున అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయంటే పల్నాడు ప్రాంతంలోని మిగిలిన మండల గ్రామాల్లో ఏరకంగా జరుగుతోందనేది అర్థమవుతోంది..

11/18/2016 - 23:58

గుంటూరు, నవంబర్ 18: అధికారం కోసం మరోమారు అధికార పార్టీ నేతలు అధర్మమార్గాన్ని ఎంచుకున్నారని, తాజాగా నగరపాలక సంస్థ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో బిఎల్‌ఒలను అడ్డుపెట్టుకుని గందరగోళానికి తెరలేపారని ఆరోపించారు.

11/18/2016 - 23:57

గుంటూరు, నవంబర్ 18: జిల్లాలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ క్రితికా శుక్లా స్పష్టంచేశారు. శుక్రవారం గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. భర్త హిమాంశు శుక్లా రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

11/18/2016 - 23:57

గుంటూరు (కొత్తపేట), నవంబర్ 18: గుంటూరు మార్కెట్‌యార్డులో పెండింగ్‌లో ఉన్న లైసెన్సులను మంజూరు చేయాలని యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు వ్యవసాయ శాఖ కమిషనర్ మల్లికార్జునరావును కోరారు. శుక్రవారం కమిషనర్‌ను మన్నవ సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. యార్డులో లైసెన్సులు ఉన్నవారికి షాపులు లేవని, షాపులు ఉన్నవారికి లైసెన్సులు లేవని, దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

11/18/2016 - 23:56

గుంటూరు (కల్చరల్), నవంబర్ 18: మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఆధునిక యాంత్రిక యుగంలో మన భారతదేశం అన్ని రంగాల్లో సముజ్వల ప్రగతిని మరింతగా సాధించాలంటే నారీలోకం శక్తివంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రా మహిళా సభ కళాశాల, హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి పేర్కొన్నారు.

11/18/2016 - 23:55

పెదనందిపాడు, నవంబర్ 18: ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద మండల పరిధిలో నూతనంగా గృహాలను నిర్మించుకోనున్న పలువురు లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక ఎండిఒ కార్యాలయంలో ఎంపిపి నగరాజకుమారి అనుమతి మంజూరు పత్రాలను అందజేశారు. మండలానికి 250 గృహాలు మంజూరైనట్లు చెప్పారు. 45 రోజుల్లో ప్రారంభించి 185 రోజుల్లో గృహనిర్మాణం పూర్తిచేయాల్సి ఉందని లబ్ధిదారులకు సూచించారు.

11/18/2016 - 23:55

చిలకలూరిపేట, నవంబర్ 18: మహిళల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో చంద్రన్న చేయూత పథకం కింద రెండోవిడత 32,351 మందికి స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు 9 కోట్ల 72 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు.

Pages