S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 00:45

మునగపాక, నవంబర్ 18: రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, వైకాపా ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి - పూడిమడక ప్రధాన రహదారిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. వైకాపా నేతలు ప్లేకార్డులు చేతపట్టి మెయిన్‌రోడ్డులో ప్రదర్శనగా వచ్చి స్థానిక పిఎసిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పిఎసిఎస్ సిఇఒ నాగేశ్వరావుకు వినతిపత్రం అందజేశారు.

11/19/2016 - 00:44

యలమంచిలి రూరల్, నవంబర్ 18: 2018 నాటికి రాష్ట్రంలో గల సంక్షేమ హాస్టళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మోడల్ స్కూళ్ల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో పట్టించుకోవడం లేదన్నారు. జెడ్పీ హైస్కూల్‌లో మంచినీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

11/19/2016 - 00:44

మునగపాక, నవంబర్ 18: జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన నాగులాపల్లి శూలాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. దీని లో భాగంగా శుక్రవారం యలమంచిలి శాసనసభ్యు డు పంచకర్ల రమేష్‌బాబును గ్రామ సర్పంచ్ యల్లపు వెంకటభాస్కరరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా కలిసి ఉత్సవాన్ని తిలకించడాకి ఆహ్వనించారు.

11/19/2016 - 00:43

విజయవాడ, నవంబర్ 18: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6 దరఖాస్తులను అప్పటికప్పుడు క్లియర్ చేసి ప్రాథమిక అనుమతి పత్రాలు జారీ చేశారు. 3 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. రెండు దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేవని తిరస్కరించారు.

11/19/2016 - 00:42

ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: దుర్గమ్మ సన్నిధిలో అమ్మవారి భవానీ దీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన శత చండీ రుద్రహోమం దుర్గమ్మ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీ మల్లిఖార్జున మహా మండపం పక్కనే హోమాన్ని దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నారు. తొలి రోజున ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

11/19/2016 - 00:40

మచిలీపట్నం, నవంబర్ 18: నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమర్ధత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు.

11/19/2016 - 00:40

కైకలూరు, నవంబర్ 18: రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండో విడత మాఫీ చెల్లిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్యా శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కైకలూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళా సంఘాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రుణమాఫీ పత్రాలను అందించడానికి స్థానిక ఎంపియుపి స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

11/19/2016 - 00:39

చల్లపల్లి, నవంబర్ 18: చల్లపల్లి, కంచికచర్ల మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటనలు శుక్రవారం జరిగాయ. చల్లపల్లి మండలం వెలివోలు గ్రామంలో కృష్ణా కరకట్టపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం అవనిగడ్డకు చెందిన ఓలేటి వెంకటేశ్వరరావు (24) విజయవాడలోని ఓ ఫార్మా కంపెనీలో రిప్రజెంటివ్‌గా పని చేస్తున్నాడు.

11/19/2016 - 00:38

ఎ.కొండూరు, నవంబర్ 18:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని చీమలపాడు పాలకేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమెముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

11/19/2016 - 00:38

మచిలీపట్నం, నవంబర్ 18: నగదు రహిత ఆర్థిక లావాదేవీల నిర్వహణకు వ్యాపారులు సహకరించాలని బందరు ఆర్డీవో సాయిబాబు కోరారు. స్థానిక శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగదు రహిత వ్యాపారంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడివోలతో పాటు వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, పలు బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

Pages