S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 23:55

కర్లపాలెం, నవంబర్ 18: విద్యతోపాటుగా విద్యార్థులు క్రీడలలో పాల్గొనటం ద్వారా శారీరక ధారుడ్యం పెం పొందుతుందని ఎంపిపి మాడా వెంకటరత్నం అన్నారు. మండలంలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో కేలో ఇండి యా పోటీలను శుక్రవారం ఎంపిపి ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులకు 100, 400 మీరట్ల రన్నిం గ్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, ఖో-ఖో, కబడ్డీ పోటీలు నిర్వహించారు.

11/18/2016 - 22:42

గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం. మన మేధోసంపత్తిని పెంచేవి గ్రంథాలయాలు మాత్రమే. స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. అలాంటి విజ్ఞాన సర్వస్వాలైన గ్రంథాలయాలు నేడు ఆదరణ కోల్పోతున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. దినపత్రికలు సక్రమంగా రాకపోవడం, బెంచీలు, కుర్చీలు లేకపోవడం, గ్రంథాలయాధికారులు అందుబాటులో వుండకపోవడం లాంటి సమస్యలు తప్పడం లేదు.

11/18/2016 - 22:41

ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? అది దేనికి? అది ఎవరి కోసం? ప్రాచీనకాలంలో మానవ సమూహాలు, మానవ గణాలు సమాజంగా పరిణామం చెంది స్థిరీకరణ జరుగుతున్న కా లంలో ఆ సమాజ సూత్రీకరణను అమలు పరచడానికి ఒక అధికార కేంద్రం అవసరం ఏర్పడింది. సమాజ విస్తృతిని బట్టి ‘రాజ్యం’ (స్టేట్) ఏర్పడింది. ఈ రాజ్యం కొన్ని ప్రాదేశిక పరిమితుల్లో వుంటుంది.

11/18/2016 - 22:40

ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేసే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనేక కఠోర వాస్తవాల్ని కళ్లకు కట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున ఆ ప్రభావం మిగతా దేశాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోకొంత ఉంటుందన్నది కాదనలేని నిజం. ట్రంప్ ఎన్నిక నేపథ్యం, ఆ తర్వాతి పరిణామాలను విశే్లషిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి. వాటిలో కొన్ని...

11/18/2016 - 22:38

ఎలక్ట్రానిక్ మీడియా రానురానూ విశ్వసనీయతను కోల్పోతోందా? నిష్పాక్షికంగా వార్తలను ప్రజలకు చేరవేయాల్సిన టీవీ వార్తా మాధ్యమాలు వాటి సొంత ఎజెండాలను, అభిప్రాయాలను వీక్షకుల నెత్తిన బలవంతంగా రుద్దాలని చూస్తున్నాయా? ప్రభుత్వ పథకాలపై విమర్శలకు, ప్రజాభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను చానళ్లు గుర్తించలేకపోతున్నా యా?

11/18/2016 - 22:36

పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో దేశప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ప్రతిపక్ష రాజకీయవాదులు కడవలతో కన్నీరు కార్చడం నడుస్తున్న చరిత్ర. ఈ కన్నీటి కాలువలు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను ముంచెత్తుతున్నాయి.

11/18/2016 - 22:16

ప్రతాపరుద్రుడు (చారిత్రక నవల).. రచన: ఎస్.ఎం.ప్రాణ్‌రావు
వెల: రు.150/- ప్రతులకు: నవోదయ ఇతర ప్రముఖ గ్రంథ విక్రయ కేంద్రాలు.

11/18/2016 - 22:15

చిరునవ్వు వెల ఎంతంటే సిరిమల్లె పువ్వంతా? అబ్బే కాదు అది సిరులతో కొనలేనంత! అందుకేనేమో అన్నాడో కవి! ‘‘మగువలెపుడు మగవారిని చిరునవ్వుతో గెలవాలని..’’! అసలు మగవారిని మగువలూ కాదు - మగువల్ని మగవారూ కాదు- ఒక మనిషి మరో మనిషి మనసుని గెలవాలంటే సిరులూ, సంపదలూ కాదు- కావాల్సిందో అందమైన చిరునవ్వు. స్వచ్ఛమైన చిరునవ్వు! ఓ ఆప్యాయతతో నిండిన చల్లని పలకరింపులు చాలు!

11/18/2016 - 22:10

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 25ఏళ్ల నుంచి నటిగా ప్రస్థానం సాగిస్తున్న అందాల కాజోల్ ఇప్పటికీ అదే యవ్వన నిగారింపుతో మెరిసిపోతుంటుంది. ఇటీవల ఆమె ఓ బ్యూటీ కార్యక్రమానికి హాజరై తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాలను వెల్లడించింది. ఆ విషయాలు ఆమె మాటాల్లోనే..

11/18/2016 - 22:07

కాబేజీ గుజ్జు తలకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పెసర పిండి మాడుకు, జుట్టుకు పట్టిస్తే జుట్టు పెరుగుతుంది.
కలబంద ఆకుల రసం జుట్టుకు, మాడుకు పట్టించడం
ఆలివ్ ఆయిల్‌లో గుడ్డు తెల్లసొన కలిపి తలకు రాసుకోవాలి. తదుపరి స్నానం చెయ్యాలి.

Pages