S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అబ్బురపరచిన ఏరోబోటిక్ ప్రదర్శన

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లోని దుందిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో గురువారం జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఎయిర్ క్రాఫ్ట్‌లు కళ్లు మిరుమిట్లుగొల్పాయి. ఒళ్లు గగుర్పొచే విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ ప్రముఖ ఏరోబోటిక్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలను వేలాది విద్యార్థులు, విమానయాన శాఖ అధికారులు, కుటుంబ సభ్యులతో వీక్షించారు. యుకె, బ్రిటిష్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లు 1965 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాల్లో 4,800 ప్రదర్శనలు నిర్వహించినట్టు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఆసియా-పసిఫిక్, మధ్య ఈస్ట్ ప్రాంతాల్లో 60 రోజుల పర్యటనలో భాగంగా 20 ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని దుందిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో స్క్వాడ్రన్ లీడర్ డేవిడ్, మాంటెన్‌గ్రో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పైలట్లను ఎయిర్‌ఫోర్స్ అధికారులు అభినందించారు.