S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘నల్ల’ బంగారం

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తెల్లధనంగా మార్చుకోవడానికి ఎవరి మార్గాలు వాళ్లు వెతుక్కుంటున్నారు. కొంత మంది బంగారంపై దృష్టిసారించడంతో నల్లమార్కెట్‌లో బంగారం ధర అమాంతంగా 50వేలకు తులం పలుకుతోంది. ఈనెల ఎనిమిదిన ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయగానే అన్ని వ్యాపారుల మందగించగా ఒక్క బంగారం ధర మాత్రం నల్లమార్కెట్‌లో పెరిగిపోయింది. మార్కెట్‌లో బంగారం తులం ధర 32వేల రూపాయలు పలుకుతుండగా, రద్దయిన నోట్లతో బ్లాక్‌లో 50 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. మొదటి రోజు 35 నుంచి 40వేల రూపాయల ధరకు అమ్ముడు పోయింది. నల్లధనాన్ని బంగారం లోకి మార్చుకుంటున్నారు అని తెలియగానే పలువురు బంగారం వ్యాపారులపై ఐటి దాడులు జరిగాయి. ఐటి అధికారులు పూర్తిగా బంగారం దుకాణాలపై దృష్టి సారించడంతో ఒక్కసారిగా అమ్మకాలు నిలిచిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో ఎలాఉన్నా లీగల్‌గా అమ్మేందుకు సైతం బంగారం వ్యాపారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. కొద్ది మంది మాత్రం 50 వేల రూపాయలకు తులం చొప్పున అమ్ముతున్నారు. ఇది రహస్యంగా సాగుతోంది.
బ్యాంకులో రెండున్నర లక్షల రూపాయల వరకు మాత్రమే జమ చేయాలని, అంత కన్నా ఎక్కువగా లెక్కల్లో లేని మొత్తం ఉంటే నల్లధనంగా భావించి రెండు వందల శాతం అధిక పన్ను విధించనున్నట్టు ప్రచారం జరగడంతో నగదు రూపంలో డబ్బు ఉంచుకోవడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. వ్యాపార కేంద్రాలైన సికిందరాబాద్, బేగంబజార్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు వ్యాపారులు డబ్బును ఎలా మార్చుకోవాలనే దానిపైనే దృష్టిసారించారు. బంగారం రూపంలో మార్చుకోడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జంట నగరాల్లోని బంగారు వ్యాపారులు అందరికీ అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి వివరాలు అందజేయాలని ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది.