S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మినీ ఎటిఎంలుగా రేషన్ షాపులు

విజయవాడ, నవంబర్ 17: ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను పటిష్ఠంగా అమలుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. డీలర్లకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు బియ్యం, గోధుమలపై భారీగా కమీషన్ పెంచింది. రేషన్ షాపులను మినీ ఏటిఎంలుగా మార్చేసి నగదు లావాదేవీల్లో కమిషన్ అందజేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 28,942 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వాటిద్వారా ప్రతినెలా కోటీ 34 లక్షలకు పైగా రేషన్ కార్డులకు బియ్యం, కిరోసిన్, పంచదార, గోధుమల వంటి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుంటారు. నెలవారీ రేషన్ మాత్రమే కాకుండా ముఖ్యమైన పండగలైన సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌కు చంద్రన్న కానుకల పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత నిత్యావసర వస్తువులను కార్డుదారులకు అందజేస్తుంటారు. ఇందుకుగాను ప్రభుత్వ రేషన్ డీలర్లకు కమీషన్ అందజేస్తోంది. డీలర్ల కమిషన్ పెంపునకు డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలీ మాధవరావు నాయకత్వంలో సుదీర్ఘకాలంగా ఆందోళన జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి కమీషన్ పెంచారు. రేషన్ బ్యాంకింగ్ అమలు విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 28,942 రేషన్ షాపులున్నాయి. ఏజెన్సీల్లో అయితే మండల కేంద్రాల్లో మాత్రమే బ్యాంకులుంటాయి. అవికూడా గుర్తింపు పొందిన బ్యాంకులు మాత్రమే. నెలలో 20 రోజుల పాటు రేషన్ షాపుల్లో ఏటిఎం సేవలు లభించేలా చూస్తున్నారు. ఏటిఎంతో పాటు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి డీలర్లకు నెల రోజులు శిక్షణ ఇవ్వమన్నారు.