S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 12:30

బిహార్‌ : బిహార్‌ టాపర్ల కుంభకోణంలో సైన్స్‌ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్‌ కుమార్‌ను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన బిహార్‌ 12వ తరగతి ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ఇప్పటికే టాపర్‌ రూబీరాయ్‌ను అరెస్టు చేయగా ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

08/03/2016 - 11:47

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విజయవాడలో బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చీపుర్లను చేతపట్టుకుని రోడ్లను ఊడ్చారు. హోదా విషయంలో బిజెపి, టిడిపి నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

08/03/2016 - 11:46

రాజమండ్రి: నగరంలోని ఆల్మట్‌తోట వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ఆటో, వ్యాన్ ఢీకొనగా మధ్యలో ఓ బైక్ ఇరుక్కుపోయి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రెండు వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ప్రయత్నించి కింద పడ్డారు. ఆటో, వ్యాన్ మధ్య వారు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

08/03/2016 - 11:46

దిల్లీ: ఎపిలో అన్ని చోట్లా టిడిపి నేతల ఇళ్ల ముందు చీపుర్లతో తమ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరుపుతారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం జరిపిన రాష్టబ్రంద్‌తో కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు. హోదా విషయంలో టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

08/03/2016 - 11:45

హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఆర్టీసీ ఆస్పత్రిని ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బుధవారం తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సౌకర్యాల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు.

08/03/2016 - 11:45

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ప్రారంభించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలరాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు.

08/03/2016 - 11:44

ముంబయి: భారీ వర్షాల కారణంగా మహారాష్టల్రో ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై వంతనె కూలిపోగా రెండు బస్సులు, 8 వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ బస్సుల్లో 22 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. గల్లంతైన వాహనాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 50 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

08/03/2016 - 11:44

న్యూజెర్సీ: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న అభియోగంపై విశాఖకు చెందిన కూనం వీరభద్రరావును అమెరికాలోని న్యూజేర్సీలో పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30న ఆయన లాస్‌ఏంజిలెస్ నుంచి న్యూజెర్సీకి విమానంలో వెళుతూ ఓ ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఆ ఫిర్యాదుపై వీరభద్రరావును పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

08/03/2016 - 11:43

దిల్లీ: గుజరాత్ సిఎం ఆనందీబెన్ రాజీనామాను బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఇక్కడ ప్రధాని మోదీ నివాసంలో బుధవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలని భావిస్తూ ఆనందీబెన్ రాజీనామా చేశారన్నారు. ఆమె ఈరోజు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేస్తారన్నారు.

08/03/2016 - 08:08

వారణాసి, ఆగస్టు 2: దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారీస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో రోడ్‌షోతో సోనియా ప్రచార సంరంభం ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా ఆమెకు తీవ్రంగా జ్వరం రావటంతో ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఆమె వెళ్లిపోయారు.

Pages