S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరద పోటుంది.. జాగ్రత్త!

హైదరాబాద్, ఆగస్టు 2: గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల రెండు నదులకూ వరద తాకిడి ఎక్కువగా ఉంటుందని కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) హెచ్చరించింది. ఈమేరకు మంగళవారం సిడబ్ల్యుసి ప్రత్యేక వరద హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా పరీవాహక ప్రాంతమైన మహాబలేశ్వర్ ప్రాంతంలో గత 24 గంటల్లో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 45 సెంటీమీటర్లకు పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్టు పేర్కొంది. దీంతో భారీ వరద ఆల్‌మట్టిలోకి చేరుతుందని, ఇప్పటికే కర్నాటకలోని ఆల్‌మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు తెలంగాణలోని జూరాల నిండి ఉండటంతో అదనంగా వచ్చే నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆల్‌మట్టి నుండి 20 వేల నుండి 30 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తుండగా, ఇప్పుడు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అంచనా వేస్తోంది. అంటే నాలుగు రోజుల తర్వాత శ్రీశైలం జలాశయానికి భారీ వరద వస్తోందని స్పష్టమవుతోంది. ఇంతటి వరద 2009లో వచ్చింది. ఇలాఉండగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్టల్రోని నాసిక్, అహమ్మద్‌నగర్, ఔరంగాబాద్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దాంతో ఔరంగాబాద్ జిల్లాలోని జైక్వాడ్ జలాశయానికి భారీ వరద వస్తోందని సిడబ్ల్యుసి హెచ్చరించింది. జైక్వాడ్ నిండితే వదిలే అదనపు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్కుకు చేరుతుంది.
మంగళవారం ఉదయానికి శ్రీశైలం జలాశయానికి 36,447 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో పూర్తిస్థాయిలో 215 టిఎంసి నీరు నిల్వ ఉంటుంది. అయితే మంగళవారం వరకు జలాశయంలో ఉన్న నీటి నిలువ 45 టిఎంసి అని లెక్కలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు కర్నాటకలోని ఆల్‌మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి 15 వేల క్యూసెక్కుల నీటినే విడుదల చేశారు. ఈ జలాశయాల నుండి బుధవారం నుండి నీటి విడుదల పెరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. నారాయణపూర్ నుండి విడుదల చేస్తున్న 15వేల క్యూసెక్కుల నీటితోపాటు నారాయణపూర్- జూరాల మధ్య ప్రాంతంలో ఉన్న పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా నదిలోకి నీరు చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టులోకి 34 వేల క్యూసెక్కులు చేరుతోంది. తుంగభద్రలో పెద్దగా మార్పు లేదు. తుంగభద్ర జలాశయంలోకి కేవలం 5900 క్యూసెక్కుల నీరు వరద వస్తోంది. ఈ జలాశయం సామర్థ్యం 100 టిఎంసి కాగా, తాజా సమాచారం ప్రకారం 40 టిఎంసి నీటి నిల్వ ఉంది.
గోదావరిలో...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 32 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టిఎంసి. కాగా, ప్రస్తుతం 44 టిఎంసి ఉంది. జైక్వాడ్ నిండితే అదనపు నీరు శ్రీరాంసాగర్‌కు చేరుతుంది.