S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 02:49

కాకినాడ, ఆగస్టు 2: ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలిచ్చిన బంద్ పిలుపునకు జిల్లా ప్రజానీకం పూర్తిగా సహకరించింది. ఇది మనందరి బాధ్యత అంటూ హోదాకై గళమెత్తింది. ప్రజల సహకారంతో ప్రతిపక్షాలు బంద్‌ను సక్సెస్ చేశాయి. హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో బంద్‌ను ఆయా వర్గాలు విజయవంతం చేశాయి.

08/03/2016 - 02:48

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: అఖండ గోదావరి నదికి అఖండ హారతి వైభవంగా జరుగుతోంది. అంత్య పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సాయంత్రం పూట జరిగే ఈ హారతిని తిలకించాలనే ఉత్సుకతతో రోజంతా వేచి వుండటం కన్పించింది. మంగళవారం రాత్రి హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వాన కురుస్తున్నా ఖాతరు చేయకుండా ముందుగానే మెట్లపై ఆశీనులై హారతి నీరాజనాన్ని తిలకించడం కన్పించింది.

08/03/2016 - 02:47

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: శ్రావణ మాసం ఆరంభం కావడంతో అంత్య పుష్కర స్నానాలకు మరింత ప్రాశస్త్యంగా నిర్వహిస్తారు. దీంతో బుధవారం నుంచి అఖండ గోదావరి నది అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరంలో అత్యధిక రద్దీగా మారేందుకు అవకాశం వుండటంతో అధికారులు ఆమేరకు ఏర్పాట్లు పెంచుతున్నారు. మంగళవారం పుష్కర రద్దీ అంతా పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్లలోనే అధికంగా కన్పించింది.

08/03/2016 - 02:46

అమలాపురం, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్‌కు కోనసీమలో ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

08/03/2016 - 02:45

రావులపాలెం, ఆగస్టు 2: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వివిధ రాజకీయ పక్షాల పిలుపు మేరకు రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన బంద్ మంగళవారం రావులపాలెం మండలంలో విజయవంతమైంది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

08/03/2016 - 02:45

రావులపాలెం, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాల్లో మూడో రోజైన మంగళవారం రావులపాలెం గౌతమీ గోదావరి పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుండే ఘాట్లో భక్తుల రద్దీ కనిపించింది. నదీ ప్రవాహం కూడా పెరగడంతో ఉత్సాహంగా భక్తులు స్నానాలాచరించారు. పెద్దయెత్తున యువత, చిన్నారులు స్నానాలకు తరలి రావడంతో ఘాట్‌లో పండుగ వాతావరణం కనిపించింది.

08/03/2016 - 02:38

తిరుపతి, ఆగస్టు 2 : ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వికలాంగుల, పునరావాస సంస్థకు 10 కోట్ల రూపాయలు మూలనిధి ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్యభవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేఖర్లకు వెల్లడించారు.

08/03/2016 - 02:36

తిరుపతి, ఆగస్టు 2 : ప్రత్యేక హోదా కోసం వైకాపా ఇచ్చిన బంద్ పిలుపు దాదాపు విజయవంతమైంది. ప్రత్యేక హోదా నినాదంతో ఆందోళనకారులు చేసిన నిరసన కార్యక్రమాలతో తిరుపతి దద్దరిల్లింది. నిత్యం గోవిందనామస్మరణలు వినిపించే తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చేసిన విమర్శలతో తిరుపతి వేడెక్కింది.

08/03/2016 - 02:35

శ్రీ కాళహస్తి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని తేరువీధిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

08/03/2016 - 02:35

తిరుమల, ఆగస్టు 2: రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలుగా విభజించిందని, బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడాన్ని చూస్తామన్నారు. ఇస్తామన్నారు. ఇప్పుడు కుదరదంటున్నారని అలా చేస్తే ఎలా అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మంగళవారం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

Pages